Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియో : 'మాస్‌' కి స్టెప్స్ వేసిన కల్కి డైరెక్టర్‌

వివరాల్లోకి వెళ్తే... తాజాగా కల్కి టీం తో కలిసి నాగ్‌ అశ్విన్‌ తన బర్త్‌ డే ను జరుపుకున్నాడు. ఆ సమయంలో నాగార్జున మాస్‌ సినిమాలోని అన్న మాస్ పాటకు నాగ్‌ అశ్విన్ డాన్స్ చేశాడు.

By:  Tupaki Desk   |   24 April 2024 11:21 AM GMT
వైరల్‌ వీడియో : మాస్‌ కి స్టెప్స్ వేసిన కల్కి డైరెక్టర్‌
X

టాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు పాన్‌ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. మే నెలలో సినిమాను విడుదల చేయాలని భావించినా కూడా ఎన్నికల కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. నెల ఆలస్యంగా కల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కల్కి విడుదల విషయం పక్కన పెడితే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన మాస్‌ డాన్స్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ రేంజ్ లో మాస్‌ మనిషి నాగ్‌ అశ్విన్‌ లో దాగి ఉన్నాడా అంటూ అంతా కూడా అవాక్కవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే... తాజాగా కల్కి టీం తో కలిసి నాగ్‌ అశ్విన్‌ తన బర్త్‌ డే ను జరుపుకున్నాడు. ఆ సమయంలో నాగార్జున మాస్‌ సినిమాలోని అన్న మాస్ పాటకు నాగ్‌ అశ్విన్ డాన్స్ చేశాడు. ఆ నాగ్‌ స్థాయిలో ఈ నాగ్‌ కూడా షర్ట్‌ మడత వేసి మరీ స్టెప్స్‌ వేసేందుకు ప్రయత్నించాడు. మొత్తానికి భలే మెప్పించాడు.

నాగ్‌ అశ్విన్‌ చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. మహానటి సినిమాను అద్భుత దృశ్యకావ్యం గా తీర్చి దిద్దిన నాగ్‌ అశ్విన్ ప్రతిభను ఎంత మెచ్చుకున్నా తక్కువే అన్నట్లుగా విమర్శకులు ప్రశంసలు కురిపించారు.

ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు తెలుగు దర్శకులు పాన్ ఇండియా మూవీ అంటూనే ప్రచారం చేశారు. కానీ మొదటి సారి పాన్ వరల్డ్‌ మూవీ అంటూ నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను ప్రచారం చేస్తున్నాడు. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తో పాన్‌ వరల్డ్‌ రేంజ్ డైరెక్టర్ గా నాగ్‌ అశ్విన్‌ నిలవడం ఖాయం అనిపిస్తోంది.