Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఫుల్‌ జోష్ లో లేడీ సూపర్‌ స్టార్‌

తాజాగా ఒక కార్యక్రమంలో భర్త విఘ్నేష్ శివన్‌ తో కలిసి హాజరు అయిన సందర్భంగా అక్కడి వారితో ఇలా చిల్‌ అవుతూ ఫుల్‌ జోష్ తో కెమెరాకు ఫోజ్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   23 April 2024 11:30 AM GMT
పిక్ టాక్‌ : ఫుల్‌ జోష్ లో లేడీ సూపర్‌ స్టార్‌
X

లేడీ సూపర్ స్టార్‌ నయనతార సాధారణంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటుంది. ఆమె ఫోటోలు మరియు వీడియోలు చాలా రేర్ గా మాత్రమే సోషల్‌ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇక మీడియా లో ఆమె సందడి చాలా తక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తన సినిమాల ప్రమోషన్స్ కే హాజరు అవ్వని నయనతార ను సినిమాల్లో తప్ప మీడియాలో ఎక్కువగా చూసే అవకాశం లేదు. అయితే అప్పుడప్పుడు మాత్రం ఇలాంటి ఫోటోలతో నయనతార సర్‌ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నెట్టింట నయతార ఫ్యాన్‌ పేజ్‌ షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాయి. పెళ్లి, పిల్లల తర్వాత కూడా నయనతార సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ఇంకా ఇలాంటి ఫోటోలతో సందడి చేస్తుందంటే కారణం ఆమెకు ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్‌ అనడంలో సందేహం లేదు.

తాజాగా ఒక కార్యక్రమంలో భర్త విఘ్నేష్ శివన్‌ తో కలిసి హాజరు అయిన సందర్భంగా అక్కడి వారితో ఇలా చిల్‌ అవుతూ ఫుల్‌ జోష్ తో కెమెరాకు ఫోజ్ ఇచ్చింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవ్వబోతుంది. అయినా కూడా ఇంకా పాతికేళ్ల పడుచు అందం అంటూ లేడీ సూపర్ స్టార్ ను ఫ్యాన్స్ అభినందించే విధంగా ఈ ఫోటోలు ఉన్నాయి.