Begin typing your search above and press return to search.

ఓం భీమ్ బుష్.. బాక్సాఫీస్ వద్ద పెద్ద మంత్రమే...

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఓం భీమ్ బుష్ మూవీ ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 March 2024 9:28 AM GMT
ఓం భీమ్ బుష్.. బాక్సాఫీస్ వద్ద పెద్ద మంత్రమే...
X

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఓం భీమ్ బుష్ మూవీ ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. అనేక చోట్ల థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ ను థియేటర్లలో ఆడియన్స్ ఫుల్ గా ఆస్వాదిస్తున్నారు.


హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్ లీడ్ రోల్స్ లో నటించారు. ఆదిత్య మీనన్, రచ్చ రవి ఇతర పాత్రలు పోషించారు. రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసుకున్నట్లే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిందీ సినిమా. వీకెండ్, హోలీ హాలీడే కావడంతో ఈ మూవీ చూసేందుకు సినీ లవర్స్ పోటీ పడుతున్నారు. ఆన్ లైన్ లో టికెట్స్ ను తెగ బుక్ చేస్తున్నారు.

అయితే ఓం భీమ్ బుష్ మూవీ అందరూ ఆశించినట్లే మంచి ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు కలెక్షన్స్ రూ.4.6 కోట్లు రాగా, రెండో రోజు వసూళ్లు రూ.5.84 కోట్లు వచ్చాయి. ఇక నాలుగో రోజు ఫస్ట్ డే కన్నా అదిరిపోయే వసూళ్లు (రూ.4.75 కోట్లు) సాధించింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజులకు గాను రూ. 21.75 కోట్లు వసూలు చేసింది. యూఎస్ ఏలో $400K రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

గతేడాది సామజవరగమన సినిమాతో మంచి హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. ఇప్పుడు ఓం భీమ్ బుష్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. శ్రీవిష్ణు కెరీర్ లో అత్యంత వేగంగా రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన సినిమాగా ఓం భీమ్ బుష్ సినిమా నిలిచింది. ప్రస్తుతం హీరో శ్రీవిష్ణు తో పాటు మూవీ టీమ్ సక్సెస్ మూడ్ ను ఎంజాయ్ చేస్తోంది. త్వరలోనే ఆడియన్స్ వద్దకు సక్సెస్ టూర్ రూపంలో వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా వీక్ డేస్ లో కూడా జోరు కొనసాగిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓం భీమ్ బుష్ అనేక ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుందని చెబుతున్నారు. త్వరలోనే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ఫీట్‌ను అందుకోనుందని అంటున్నారు. యూఎస్ ఏలో హాఫ్ మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతున్నట్లు వెల్లడించారు. మరి ఈ మూవీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.