Begin typing your search above and press return to search.

ఓం భీమ్ బుష్.. ఇది బాక్సాఫీస్ లెక్క!

టాలీవుడ్ సినీ ప్రియులను చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్విస్తున్నారు యంగ్ హీరో శ్రీవిష్ణు, కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్

By:  Tupaki Desk   |   25 March 2024 8:42 AM GMT
ఓం భీమ్ బుష్.. ఇది బాక్సాఫీస్ లెక్క!
X

టాలీవుడ్ సినీ ప్రియులను చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్విస్తున్నారు యంగ్ హీరో శ్రీవిష్ణు, కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. మార్చి 22వ తేదీన వీరి ముగ్గురి కాంబోలో విడుదలైన ఓం భీమ్ బుష్ మూవీ.. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. గతంలో వీరు ముగ్గురూ బ్రోచేవారెవరురా సినిమాతో అలరించగా.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మరోసారి సందడి చేస్తున్నారు.

రిలీజ్ కు ముందు మంచి బిజినెస్ జరుపుకున్న ఓం భీమ్ బుష్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ దగ్గరకు చేరుకుంది. తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ మూడు రోజుల్లో ఈ సినిమా రూ.17 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

రూ.4.6 కోట్ల వసూళ్లతో అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించిందీ ఓం భీమ్ బుష్ మూవీ. రెండో రోజు కలెక్షన్లు పెరిగి రూ.5.8 కోట్లకుపైగా రాబట్టింది. ఇక మూడో రోజైన ఆదివారం ఏకంగా రూ.6.56 కోట్లు కలెక్షన్లు సాధించింది. దీంతో మొత్తంగా మూడు రోజుల గ్రాస్ వసూళ్లు రూ.17 కోట్లకుపైగా వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక యాఎస్ లో ఈ సినిమా $315K వసూళ్లు రాబట్టిందని, అక్కడ కూడా దూసుకుపోతుందని వెల్లడించారు.

అయితే ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే లాభాల బాట పట్టనుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. సోమవారం (మార్చి 25) హోలీ, శుక్రవారం (మార్చి 29) గుడ్ ఫ్రైడే ఈ సినిమాకు బాగా కలిసి వస్తాయని చెబుతున్నారు. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోపు ఓం భీమ్ బుష్ మూవీ మంచి లాభాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇక ఈ మూవీలో శ్రీవిష్ణు తో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీకి థియేటర్లలో ఆడియన్స్ ఫుల్ గా నవ్వుకుంటున్నారు. ముగ్గురూ కూడా మరోసారి తమ కామిక్ టైమింగ్ తో అదరగొట్టారు. ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగిన స్టోరీనే ఓం భీమ్ బుష్ మూవీ. గతేడాది సామజవరగమనతో మంచి హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి లాాభాలు కురిపిస్తుందో చూడాలి.