Begin typing your search above and press return to search.

IPL స్టార్ కెప్టెన్ నోట 'పోకిరి - పుష్ప' డైలాగ్స్

ఇది కేవలం వేసవి సీజన్ మాత్రమే కాదు... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ కూడా. క్రికెట్ ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది

By:  Tupaki Desk   |   24 April 2024 11:55 AM GMT
IPL స్టార్ కెప్టెన్ నోట పోకిరి - పుష్ప డైలాగ్స్
X

ఇది కేవలం వేసవి సీజన్ మాత్రమే కాదు... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ కూడా. క్రికెట్ ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. లీగ్‌లో ఆడుతున్న‌ జట్లకు ప్ర‌జలు మద్దతు ఇస్తున్నారు. గత రెండు సీజన్లకు భిన్నంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చక్కటి ఫామ్‌ను ప్రదర్శిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ లను గెలుస్తూ, అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ లతో వీక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తోంది.

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌ను 20.5 కోట్లకు SRH కొనుగోలు చేసింది. జట్టుకు కూడా కెప్టెన్‌గా చేసింది. అతని కెప్టెన్సీ చాలా బాగా వ‌ర్క‌వుటైంది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టుకు అంతా అనుకూలంగా జరుగుతోంది. పాట్ కమిన్స్ ఇప్పటికే తెలుగు వారికి ప్రియతముడిగా మారాడు. ఇప్పుడు తన తెలుగు డైలాగ్స్‌తో మరింత మంది హృదయాలను గెలుచుకున్నాడు.

ఇటీవల సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో కలిసి నటించాడు ఆయ‌న‌. ఇద్దరూ కలిసి ఓ యాడ్ చేశారు. ఆటలో అతని బోల్డ్ అప్రోచ్ కాకుండా, అతడిలో వినోదభరితమైన కోణం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇటీవలి వీడియోలో స్టార్ క్రికెటర్ క‌మిన్స్ పోకిరి డైలాగులు చెప్పాడు. పుష్ప లోని ఐకానిక్ డైలాగ్‌లను ప‌లుకుతూ ఆక‌ట్టుకున్నాడు. తనదైన‌ విలక్షణ శైలిలో, ``ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను`` అంటూ చివర్లో ట్రేడ్‌మార్క్ పవన్ కళ్యాణ్ సంజ్ఞ కూడా చేస్తూ కనిపించాడు. ఈ క్లిప్ చూడటం చాలా ఫన్నీగా ఆక‌ట్టుకుంది. చాలా కాలం తర్వాత పాట్ కమిన్స్ సార‌థ్యంలోని ఎస్.ఆర్.హెచ్ జ‌ట్టు ఈసారి ట్రోఫీని అందుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.

పాట్ క‌మిన్స్ ఇప్పుడు మ‌హేష్- బ‌న్ని- ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు మ‌రింత ప్రీతిపాత్రుడ‌య్యాడు. ఇప్ప‌టికే బ‌న్ని పాట‌ల‌కు డ్యాన్సులు చేస్తూ అల‌రిస్తున్న ఆస్ట్రేలియ‌న్ స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ త‌ర్వాత పాట్ క‌మిన్స్ కూడా అంతే గొప్ప‌గా పాపుల‌ర‌వుతున్నాడు.