Begin typing your search above and press return to search.

పవన్ ఓజీ.. మరో రూమర్ టైటిల్‌

పవర్ ఫుల్‌ మాఫియా బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాను ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Feb 2024 7:04 AM GMT
పవన్ ఓజీ.. మరో రూమర్ టైటిల్‌
X

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న సినిమాల్లో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ' మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ అనడంలో సందేహం లేదు. పవర్ ఫుల్‌ మాఫియా బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాను ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ సినిమాకు ఓజీ కాకుండా మరో టైటిల్ ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొన్నటి వరకు 'ఓజాస్ గంభీర' అనే టైటిల్ ను ఈ సినిమాకు అనుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మరో టైటిల్ ప్రచారం జరుగుతోంది.

పవన్ ఇమేజ్ కి సరిగ్గా సెట్‌ అయ్యే విధంగా 'హంగ్రీ చీతా' (ఆకలితో ఉన్న చిరుత) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌ లో విడుదల అవ్వబోతున్న సినిమా కనుక ఈ సినిమాకు ఆ ఇంగ్లీష్ టైటిల్ ను భావిస్తున్నారని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ సినిమాలో పవన్ కి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. సాహో వంటి భారీ యాక్షన్ సినిమా తో ఉత్తరాది ప్రేక్షకులను అలరించిన సుజీత్‌ మరోసారి అదే స్థాయి యాక్షన్ ను పవన్‌ కళ్యాణ్‌ తో చేయిస్తున్నాడు. పలువురు బాలీవుడ్‌ స్టార్స్ ఈ సినిమాతో సౌత్‌ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కనుక పాన్ ఇండియాలో ఈ సినిమా కుమ్మేయడం ఖాయం అనిపిస్తుంది.