Begin typing your search above and press return to search.

కాఖీలో కాక పుట్టించేలా హీరోలు!

అందుకు ప్ర‌భాస్..ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. నాగార్జున.. కార్తీ లాంటిస్టార్లు సంసిద్ద‌మై ఉన్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   28 April 2024 11:30 AM GMT
కాఖీలో కాక పుట్టించేలా హీరోలు!
X

తెలుగులో స‌రైన కాప్ స్టోరీలొచ్చి చాలా కాల‌మ‌వుతుంది. 'సింగం' ప్రాంచైజీ త‌ర్వాత థియేట‌ర్లో ఒక్క ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ కూడా క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే. అందులోనూ తెలుగు నుంచైతోపోలీస్ స్టోరీలొచ్చి చాలా కాల‌మ‌వుతోంది. మన స్టార్లు యూనిఫాం ధ‌రించిన క‌థ‌లు చాలా కాలం క్రిత‌మే వ‌చ్చాయి. దీంతో మ‌ల్లీ యూనిఫాం సినిమాలు ఎప్పుడొస్తాయా? అని ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఆస‌క్తిగానే ఎదురు చూస్తున్నారు. అందుకు ప్ర‌భాస్..ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. నాగార్జున.. కార్తీ లాంటిస్టార్లు సంసిద్ద‌మై ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌వ‌న్ పోలీస్ పాత్ర పోషిస్తున్న‌ట్లు వినిపిస్తుంది. 'గ‌బ్బ‌ర్ సింగ్' సెంటిమెంట్ని రిపీట్ చేస్తూ హ‌రీష్ శంక‌ర్ పీకేలో హాస్యాన్ని బేస్ చేసుకుని అదే త‌ర‌హా రోల్ చేయిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ప‌వ‌న్ కి పోలీస్ పాత్ర‌లు కొత్తేం కాదు. అలాంటి పాత్ర‌లు ఆయ‌న‌కు కొట్టిన పిండి. ఇప్ప‌టికే చాలా చిత్రాల్లో భిన్న‌మైన పోలీస్ పాత్ర‌లెన్నో చేసారు.

ఇక డార్లింగ్ ప్ర‌భాస్ ఇంత‌వ‌ర‌కూ పోలీస్ యూనిఫాం ధ‌రించింది లేదు. పాన్ ఇండియా స్టార్ అయిన ఇంత‌వ‌ర‌కూ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఇదే పాయింట్ గా ప‌ట్టుకుని సందీప్ రెడ్డి వంగ ఏకంగా ప్ర‌భాస్ ని పాన్ ఇండియాలోనే పోలీస్ పాత్ర‌తోప‌రిచ‌యం చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో స్పిరిట్ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్ పవ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర పోషిస్తున్నారుట‌. ఇది ప‌క్కా సందీప్ మార్క్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. ఆ పాత్ర‌లో నెక్స్ట్ లెవ‌ల్ పోలీస్ ని ప‌రిచ‌యం చేస్తాడ‌ని అంతా భావిస్తున్నారు.

అలాగే కింగ్ నాగార్జున ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో పోలీస్ పాత్ర‌లు పోషించారు. కానీ గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీలో మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. తాజాగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తోన్న 'కుభేర' లో మాత్రం ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌లోనే క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఈ రోల్ ఎంతోఎంగేజింగ్ గా ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలంటున్నాయి. ఇక కార్తీ హీరోగా న‌టిస్తున్న 'స‌ర్దార్ -2' లో పోలీస్ రోల్ పోషిస్తున్న‌ట్లు స‌మాచారం. స‌ర్దార్ లో స్పై రోల్ అయినా ఈసారి మాత్రం మిత్ర‌న్ మ‌హిళల అక్ర‌మ‌ర‌వాణా..డ్ర‌గ్స్ నేప‌థ్యాన్ని తీసుకోవ‌డంతో క్రైమ్ పోలీస్ గా కార్తీ పాత్ర‌ని ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక 'కాఖీ'లో కార్తీ పోషించిన ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌తో న‌టుడిగా అత‌డి స్థాయి రెట్టింపు అయిన సంగ‌తి తెలిసిందే.