Begin typing your search above and press return to search.

ట్యాలెంటే కాదు స్పీడున్న యంగ్ బ్యూటీ

కానీ అన్నిటినీ అధిగ‌మించి ప్ర‌తిభ‌తో దూసుకుపోయిన ఈ బ్యూటీ నేటిత‌రంలో స్పీడున్న క‌థానాయిక‌గా పాపుల‌రైంది.

By:  Tupaki Desk   |   23 March 2024 2:42 PM GMT
ట్యాలెంటే కాదు స్పీడున్న యంగ్ బ్యూటీ
X

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి ప్రియాంక మోహన్ వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కెరీర్ ఆరంభం ఈ అమ్మ‌డు సోసోనే అంటూ విమర్శించిన వారు ఉన్నారు. కానీ అన్నిటినీ అధిగ‌మించి ప్ర‌తిభ‌తో దూసుకుపోయిన ఈ బ్యూటీ నేటిత‌రంలో స్పీడున్న క‌థానాయిక‌గా పాపుల‌రైంది.


కోలీవుడ్ లో డాక్టర్ సినిమాలో న‌టించిన ప్రియాంక‌.. తెలుగులో నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న `గ్యాంగ్ లీడర్`లో న‌టించింది. విక్ర‌మ్ కె కుమార్ ఈ భామ‌ను తెలుగు సినిమాకి ప‌రిచ‌యం చేసారు. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందేమీ లేదు. ఎతర్క్కుం తునింధవన్ లాంటి వాణిజ్యపరంగా హిట్ చిత్రంలో న‌టించింది. చివరిగా ఐ యామ్ చందు, కెప్టెన్ మిల్లర్ చిత్రాల్లో కనిపించింది. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ OG లో న‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కవిన్ 04 అలాగే జయం రవితో ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని చిత్రంలోను న‌టిస్తూ బిజీగా ఉంది. త‌దుప‌రి దళపతి విజయ్ - వెంక‌ట్ ప్ర‌భు కాంబినేష‌న్ మూవీలోను ఈ బ్యూటీ అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని ప్ర‌చారం ఉంది.


నాని, ధ‌నుష్‌, జ‌యం ర‌వి లాంటి హీరోల‌తో న‌టించిన ఈ బ్యూటీ త‌దుప‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, విజ‌య్ లాంటి హీరోల స‌ర‌స‌న న‌టిస్తుండ‌డం చూస్తుంటే త‌న లైన‌ప్ నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంద‌ని చెప్పాలి. మ‌రోవైపు ప్రియాంక మోహ‌న్ సోష‌ల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. తాజాగా ఈ బ్యూటీ ఒక అంద‌మైన ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఇందులో బ్లూ అండ్ బ్లాక్ క‌ల‌ర్ ఫ్రాక్ ని ధ‌రించి బెడ్ పై ఫోజులిచ్చింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో ప్రియాంక అల్ట్రా స్టైలిష్ గా గ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం అభిమానులు ఈ ఫోటోల‌ను వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. ప్ర‌తిభ‌తో పాటు ప్ర‌చారం కూడా ఈ రంగంలో అవ‌స‌రం. అందుకే ఇత‌రుల‌తో పోటీప‌డుతూ ఈ బ్యూటీ కూడా ఛాలెంజింగ్ గా దూసుకెళుతోంద‌ని చెప్పాలి.