Begin typing your search above and press return to search.

క్యాలెండ‌ర్ భంగిమ‌లో కాక పుట్టిస్తోన్న వారియ‌ర్!

అమ్మ‌డికిప్పుడు మునుప‌టిలా అవ‌కాశాలు రావ‌డం లేదు.

By:  Tupaki Desk   |   22 March 2024 12:32 PM GMT
క్యాలెండ‌ర్ భంగిమ‌లో కాక పుట్టిస్తోన్న వారియ‌ర్!
X

ఇండ‌స్ట్రీకి మెరుపులా దూసుకొచ్చిన ప్రియా ప్ర‌కాశ్ వారియర్ ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరు. క‌న్నుగీటున వీడియో తో అమ్మ‌డు ఫేమ‌స్ అయిపోవ‌డం అపై సినిమా అవ‌కాశాల సంగ‌తి తెలిసిందే. ఒక‌టి కాదు..ఏకంగా మూడు భాష‌ల్లోనే ఛాన్సులు అందుకుని మెరిసింది. అయితే ఇప్పుడా మెరుపులపై మ‌స‌క‌బారుతున్న‌ట్లే క‌నిపిస్తుంది. అమ్మ‌డికిప్పుడు మునుప‌టిలా అవ‌కాశాలు రావ‌డం లేదు. మ‌ల‌యాళం..తెలుగు..హిందీలో సినిమాలు చేసింది.


కానీ వాటిలో ఏది హిట్ అవ్వ‌లేదు. అవి ఎప్పుడు రిలీజ్ అయి ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియ‌దు. మ‌రి తాజా ప‌రిస్థితి ఏంటి? అటే ల‌వ్ హ్యాక‌ర్స్.. విష్ణు ప్రియ అనే ప్రాజెక్ట్ లు క‌నిపిస్తున్నాయి. కానీ అవి పెండింగ్ ప్రాజెక్ట్ ల్లా క‌నిపిస్తుంది. ఆ సినిమాల ప్ర‌క‌టనొచ్చి చాలా కాల‌మ‌వుతుంది. అవి షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయా? ఆగిపోయాయా? అన్న‌ది కూడా క్లారిటీ లేదు. కొత్త అవ‌కాశాలు కూడా చేతిలో లేవు.

దీంతో అమ్మ‌డి కెరీర్ బాగా నెమ్మ‌దించిన‌ట్లే క‌నిపిస్తుంది. న్యూఇయ‌ర్ లో పెద్ద‌గా హంగామా చేసిన‌ట్లు క‌నిపించ‌లేదు. ఇలా ఉంది ప్రియా వారియ‌ర్ ప్రోఫెష‌న‌ల్ కెరీర్. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం అమ్మ‌డు యాక్టివిటీ ఏమాత్రం త‌గ్గించ‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో కుర్రాళ్ల గుండెల్లో నిప్పులు పోస్తూనే ఉంది. హాట్ హాట్ ఫోటోల‌తో చెల‌రేగుతూనే ఉంది. ఇన్ స్టా ఫాలోయింగ్ మాత్రం త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతుంది.

తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డి లా థియేట‌ర్లో సెగలు పుట్టిస్తోన‌న్ భంగిమ‌ల‌తో నెట్టింట్లోకి వచ్చేసింది. బులుగు రంగు మెరుపుల దుస్తుల్లో అమ్మ‌డు స్కిన్ షో కాక పుట్టిస్తుంది. నైజీరియ‌న్ భామ‌లా డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్... కాళ్ల‌కు ధ‌రించిన బ్లాక్ షూస్..కిల్ల‌ర్ లుక్ తో స‌ల‌ప‌రం పుట్టిస్తుంది. 2024-25 సెల‌బ్రిటీ క్యాలెండ్ ర్ కి ఇచ్చిన భంగిమ‌లివి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.