Begin typing your search above and press return to search.

చరణ్ - తారక్.. మళ్ళీ ఎప్పుడు ఇలా..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండేళ్లు అయిపోయింది అప్పుడే

By:  Tupaki Desk   |   25 March 2024 2:30 PM GMT
చరణ్ - తారక్.. మళ్ళీ ఎప్పుడు ఇలా..
X

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండేళ్లు అయిపోయింది అప్పుడే. ఇప్పటికీ చాలా మందికి ఆ చిత్రం బాగా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. తొలిసారి టాలీవుడ్ కు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చింది. ప్రపంచంలో ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను అందుకుంది. మొన్న జరిగిన ఆస్కార్ వేడుకల్లో నాటు, నాటు హుక్ స్టెప్ కనిపించింది. ఇప్పటికీ పలు అరుదైన ఘనతలు సాధిస్తూనే ఉంది.

ఇక ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. గ్లోబల్ వైడ్ గా గుర్తింపు దక్కించుకున్నారు. దేశ విదేశాల్లో ఒక్కసారిగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. పలు ఫేమస్ ఫారిన్ మ్యాగ్ జైన్లపై దర్శనమిచ్చారు. విదేశీ మీడియాలో కూడా కనిపించారు. తమ నటనతో అంతలా ఆకట్టుకున్న చరణ్, తారక్.. ప్రస్తుతం తమ కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేస్తుండగా.. జూనియర్ ఎన్టీఆర్ దేవర షూట్ లో బిజీగా ఉన్నారు. ఇక మరో రెండు రోజుల్లో చరణ్ బర్త్ డే రానుంది. ఆ రోజు చరణ్ మూవీల నుంచి సూపర్ అప్డేట్స్ సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. వాటి కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఏకంగా గంటలు లెక్కపెట్టుకుంటున్నారు కూడా.

అదే సమయంలో చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటి చరణ్ అప్పుడే సెలబ్రేట్ చేసుకున్నారా అని డౌట్ వచ్చిందా?.. ఆ వీడియో ఇప్పుడిది కాదండీ.. రెండేళ్ల క్రితంది. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన మూడు రోజులకే వచ్చిన చరణ్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. రాజమౌళితో పాటు సతీసమేతంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు.

ఆ సెలబ్రేషన్స్ లో ఎన్టీఆర్ హడావుడి మామూలుగా లేదు. చరణ్ కు గ్రాండ్ గా విష్ చేసి కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత జక్కన్న, చరణ్, తారక్ ముగ్గురూ హగ్ చేసుకుని చిన్న పిల్లల్లా గెంతులు కూడా వేశారు. అప్పుడు సినీ వర్గాల్లో ఫుల్ వైరల్ గా మారిన ఈ వీడియో.. ఇప్పుడు మళ్లీ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు... మళ్లీ ఎప్పుడు అన్నా ఇలా అని కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ కోసమే తారక్, చరణ్ కలిశారని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. పైగా వాళ్ళు ఇద్దరు కలిసి చాలా కాలమైంది. నిజంగా వాళ్లిద్దరు కలుసుకున్నారో లేదో తెలియదు కానీ.. ఫ్యాన్స్ కు మాత్రం అప్పటిలా కనిపించలేదు. ఆ క్లోజ్ నెస్ అస్సలు కనిపించలేదు. మరి మళ్లీ వీళ్లిద్దరు కలిసి అప్పటిలా ఫ్యాన్స్ లో ఎప్పుడు మంచి జోష్ నింపనున్నారో చూడాలి.