Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స్టార్ హీరోని ప్రేమించి మోసం చేసిన హీరోయిన్స్ ఎవరు..?

బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీస్ చాలా కామన్. చాలా తక్కువమంది రీల్ లైఫ్ రిలేషన్ షిప్ ని రియల్ లైఫ్ దాకా తీసుకెళ్తారు

By:  Tupaki Desk   |   5 May 2024 7:04 PM GMT
బాలీవుడ్ స్టార్ హీరోని ప్రేమించి మోసం చేసిన హీరోయిన్స్ ఎవరు..?
X

బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీస్ చాలా కామన్. చాలా తక్కువమంది రీల్ లైఫ్ రిలేషన్ షిప్ ని రియల్ లైఫ్ దాకా తీసుకెళ్తారు. సినిమాలు చేస్తున్నప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలడం ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా ప్రేమలో పడ్డాడు. కానీ అతని ప్రేమ విఫలమైంది. దాదాపు రెండు దశాబ్ధాల నుంచి బాలీవుడ్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న షాహిద్ కపూర్ కొంతకాలంగా కెరీర్ లో బ్యాడ్ ఫేజ్ ఎదుర్కున్నాడు.

ఈమధ్యనే అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్న షాహిద్ కపూర్ అదే ఊపులో నాని జెర్సీ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేశాడు. ఈ రెండు సినిమాలతో షాహిద్ కపూర్ గురించి మళ్లీ బాలీవుడ్ లో మాట్లాడుకునేలా చేశాడు. ప్రస్తుతం దేవా సినిమా చేస్తున్న షాహిద్ ఆ సినిమాతో కూడా హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా షాహిద్ కపూర్ నేహా ధూపియా తో స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నాడు.

ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఎవరితో అయినా ప్రేమలో మోసపోయారా అన్న ప్రశ్న నేహా ధూపియా అడిగింది. దానికి పెద్దగా నవ్విన షాహిద్ ఒకరైతే తనను మోసం చేశారని కాని మరొకరి గురించి తనకు తెలియదని అన్నారు. నువ్వు చెప్పేది వాళ్లిద్దరి గురించేనా అని నేహా అడిగింది. వారి పేర్లు ఏమైనా చెప్పగలరా అంటే లేదు వారి పేర్లు చెప్పలేనని అన్నాడు షాహిద్ కపూర్. కెరీర్ స్టార్టింగ్ తో షాహిద్ కపూర్ స్టార్ హీరోయిన్స్ అయిన ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ లతో నటించాడు.

ఆ ఇద్దరితో షాహిద్ లవ్ ట్రాక్ నడిపించాడని టాక్ ఉంది. కరీనాతో అయితే షాహిద్ కపూర్ సీరియస్ రిలేషన్ షిప్ కొనసాగించాడని చెప్పుకుంటారు. కానీ చివరకు ఆమె షాహిద్ ని కాదని సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లాడింది. బాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో షాహిద్ కపూర్ కూడా ఒకరు. అయితే అతనికి సరైన సినిమాలు పడక కెరీర్ లో వెనకపడ్డారు. షాహిద్ నేహా ధూపియా ఇంటర్వ్యూ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.