Begin typing your search above and press return to search.

న‌న్ను క్ష‌మించండి... ఆ విష‌యం మాట్లాడ‌ను!

శ్రుతిహ‌స‌న్-శంత‌ను హ‌జారికా మ‌ధ్య దూరం పెర‌గిందంటూ ఇటీవ‌ల వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 April 2024 11:17 AM GMT
న‌న్ను క్ష‌మించండి... ఆ విష‌యం మాట్లాడ‌ను!
X

శ్రుతిహ‌స‌న్-శంత‌ను హ‌జారికా మ‌ధ్య దూరం పెర‌గిందంటూ ఇటీవ‌ల వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇరువురి ఇన్ స్టాలో అన్ ఫాలోచేసుకోవ‌డం..శ్రుతి ఖాతాలో ప్రియుడి జ్ఞాప‌కాల్ని డిలీట్ చేయ‌డం వంటి స‌న్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇద్ద‌రు విడిపోయిన‌ట్లు అధికారికంగా ఎక్క‌డా వార్త‌లు రాలేదు గానీ! అలాగే వాటి గురించి శ్రుతి గానీ..శంత‌న్ గానీ స్పందించింది కూడా లేదు. ఇంత‌వ‌ర‌కూ జ‌రిగిన తంతు అయితే ఇది. తాజాగా ఈ క‌థ‌కి సంబంధించి మ‌రో అప్డేట్ వ‌చ్చేసింది. ఇద్ద‌రు విడిపోయింది వాస్త‌వ‌మే అన్న‌ట్లు గా శంత‌ను సంకేతాలు పంపేసాడు.

ఇద్ద‌రు విడిపోయారు అంట క‌దాని? ప్ర‌శ్నించ‌గా దాన్ని ఖండించ‌లేదు. `న‌న్ను క్ష‌మించండి. ఆ విష‌యం మాట్లాడ‌ను` అనేసాడు. దీంతో మౌనం అర్దాంగీకారం అన్న‌ట్లు క‌నిపించింది. ఖండించ‌ని నేప‌థ్యంలో ఇద్ద‌రు విడిపోయిన‌ట్లే క‌నిపిస్తుంది. ఇద్ద‌రు ఓ అండ‌ర్ స్టాండింగ్ ప్ర‌కార‌మే దూర‌మైన‌ట్లు తెలుస్తోంది. ఒక‌రిపై ఒక‌రు ఎలాంటి ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం గానీ.. ఇన్ స్టాలో పోస్టు లు గానీ ఎవీ క‌నిపించ‌లేదు. ఎంత కూల్ గా క‌లిసారో..అంతే కూల్ గా దూర‌మైన‌ట్లు క‌నిపిస్తుందని ముంబై మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

ఇదే నిజ‌మైతే శ్రుతి హాస‌న్ కిది రెండ‌వ బ్రేక‌ప్. ఇంత‌కు ముందు మైఖెల్ కోర్స‌లేతో అమ్మ‌డు ప్రేమాయ‌ణం న‌డిపించిన సంగ‌తి తెలిసిందే. అత‌డిని ఏకంగా ఇండియా తీసుకొచ్చి ముంబైలో సైతం షికార్లు తిరిగింది. అటుపై డాడ్ క‌మ‌ల్ హాస‌న్ తో కూడా జంట‌గా చిక్కింది. దీంతో వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని కూడా ప్ర‌చారం సాగింది. కానీ క‌ట్ చేస్తే కొన్నాళ్ల‌కి ఎవ‌రికి వారుగా వేర‌య్యారు. ఆ స‌మ‌యంలో శ్రుతి హాసన్ చాలా సినిమాలు కూడా వ‌దులుకుంది. తొలి ప్రేమ మ‌త్తుకి కెరీర్ ని కూడా ప‌ళంగా పెట్టింది. కానీ అది పెళ్లి వ‌ర‌కూ దారి తీయ‌లేదు.

మ‌న‌సుకు సైతం త‌గిలిన బ‌ల‌మైన గాయ‌మ‌ది. దీంతో శ్రుతి మ‌ళ్లీ ప్రేమ జోలికి వెళ్ల‌ద‌నుకున్నారు. కానీ కొన్నాళ్ల‌కే శంత‌ను హ‌జారికాకు ద‌గ్గ‌రైంది. ఈసారి మాత్రం ప్రేమ విష‌యంలో ఎంతో బ్యాలెన్స్ గా సాగింది. కెరీర్ ని అశ్ర‌ద్ద చేయ‌కుండా సినిమాలు చేస్తూనే ల‌వ్ స్టోరీ న‌డిపించింది. ఇప్పుడ‌ది వీగిపోయింది. ప్ర‌స్తుతం శ్రుతి ఫోక‌స్ అంతా సినిమాల‌పైనే ఉంది. వ‌చ్చిన ఏ అవ‌కాశం విడిచిపెట్ట‌లేదు. అడ్వాన్సులు అందుకోవ‌డం సైన్ చేయ‌డం..షూట్ లో జాయిన్ అవ్వ‌డం. అదీ సంగ‌తి.