Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ ఫ్రెగ్నెంట్?

నెటిజ‌నులు ఈవెంట్ నుండి పారీ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసి `ఫ్రెగ్నెంట్` అని కామెంట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 March 2024 4:57 AM GMT
స్టార్ హీరోయిన్ ఫ్రెగ్నెంట్?
X

సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీ పుకార్లను తప్పించుకోలేరు. ఫ్రెగ్నెన్సీ ఊహాగానాలను ఎదుర్కొన్న తాజా ప్ర‌ముఖురాలు, న‌టి పరిణీతి చోప్రా తన త‌దుప‌రి నెట్‌ఫ్లిక్స్ చిత్రం `చమ్కిలా` ట్రైలర్ ఈవెంట్‌కు వదులుగా ఉన్న దుస్తుల్లో రావ‌డంతో ర‌క‌ర‌కాల సందేహాలు వ‌చ్చాయి. పారీ ఈ వేడుక‌కు నలుపు రంగు కఫ్తాన్ డ్రెస్ ధరించి వచ్చింది. నెటిజ‌నులు ఈవెంట్ నుండి పారీ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసి `ఫ్రెగ్నెంట్` అని కామెంట్ చేస్తున్నారు.


అయితే తాను గర్భవతి అని ఆశ్చర్యపోతున్న వ్యక్తులపై పరిణీతి దృష్టి సారించింది. బేబి బంప్ ప్ర‌చారాన్ని ఖండించింది. ఇన్ స్టాలో స్మైల్ ఎమోజీతో పాటు, ``కఫ్తాన్ దుస్తులు = గర్భం`` అని రాసింది. భారీ చొక్కా = గర్భం. సౌకర్యవంతమైన భారతీయ కుర్తా = గర్భం..`` అంటూ వ్యాఖ్యానించింది. నిజానికి వ‌దులుగా ఉండే దుస్తులు ధ‌రిస్తే గ‌ర్భం వ‌చ్చిన‌ట్టేనా? అనేది పారీ ప్ర‌శ్న‌. కొన్ని వారాల ముందు, కొన్ని మీడియా పోర్టల్స్ లోను ప‌రిణీతి మొదటి బిడ్డతో గర్భవతిగా ఉంద‌ని క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం మేర‌కు.. పరిణీతి తన పనిపై మాత్ర‌మే దృష్టి సారిస్తోంది. పరిణీతి తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడుతుంది. త‌న దిన‌చ‌ర్య చూస్తే గ‌ర్భ‌వ‌తి అని ధృవీక‌రించ‌లేం. భవిష్యత్తులో తన పనితో తాను బిజీగా ఉంటుంది. కమిట్‌మెంట్‌లలో దేనినీ బ్రేక్ చేసేందుకు సిద్ధంగా లేదు. ప్ర‌తిదీ చాలా ముందుగానే ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతోంది.

గ‌తేడాది ఆప్ నాయకుడు రాఘవ్ చద్దాను పారీ వివాహం చేసుకుంది. ఈ జంట 24 సెప్టెంబర్ 2023న ఉదయపూర్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఘ‌న‌మైన పెళ్లి జ‌రిగింది. వారి వివాహమైన కొన్ని రోజుల తర్వాత పెళ్లి ఆల్బమ్‌ను మాత్రమే కాకుండా, వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసింది.