Begin typing your search above and press return to search.

హీరో వార‌సుడితో లేడీ డైరెక్ట‌ర్!

ఇప్పుడ‌ది వీలుప‌డ‌క‌పోవ‌డంతో సుధ ఈ గ్యాప లో ధృవ్ తో సినిమా చేసేలా ఒప్పందం చేసుకున్న‌ట్ల తెలుస్తోంది. ధృవ్ కూడా ఖాళీగా లేడు.

By:  Tupaki Desk   |   27 April 2024 1:30 PM GMT
హీరో వార‌సుడితో లేడీ డైరెక్ట‌ర్!
X

'ఆదిత్య వ‌ర్మ‌'తో కోలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్ ఖాతాలో స‌రైన స‌క్సెస ప‌డ‌లేదు. ఆదిత్య త‌ర్వాత 'వ‌ర్మ‌'..'మ‌హాన్' లాంటి సినిమాలు చేసాడు గానీ అవి ఆశించిన ఫ‌లితాలు రాలేదు. బ్యాకెండ్ లో త‌న‌యుడు కోసం విక్ర‌మ్ ప‌నిచేస్తున్నా? ఆయ‌న స్ట్రాట‌జీ కూడా మార్కెట్ లో వ‌ర్కౌట్ అవ్వ‌డం లేదు. అలా యంగ్ హీరో ఇంకా కాంపిటీష‌న్ లోకి రాలేక‌పోతున్నాడు. దీంతో లాభం లేద‌నుకున్న విక్ర‌మ్ ఈసారి ఏకంగా త‌నయుడి కోసం లేడీ డైరెక్ట‌ర్ నే రంగంలోకి దింపుతున్న‌ట్ల తెలుస్తోంది.

'ఆకాశం నీహ‌ద్దురా' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కించుకున్న సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో ధృవ్ ఓ సినిమా చేసేలా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడుట‌. ఇటీవ‌లే ధృవ్ కి ఆమె ఓ స్టోరీ కూడా వినిపించార‌ని స‌మాచారం. స్క్రిప్ట్ న‌చ్చ‌డంతో ధృవ్ కూడా ఒకే చేసిన‌ట్లు తెలిసింది. నిర్మాణ సంస్థ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చాక ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. వాస్త‌వానికి సుధ కొంగ‌ర సూర్య హీరోగా ఓ సినిమా తెర‌కెక్కించాల్సి ఉంది.

'కంగువ' త‌ర్వాత సూర్య ఆమె ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేలా ఒప్పందం జ‌రిగింది. ఆకాశం నీ హ‌ద్దురా స‌క్సెస్ త‌ర్వాత వెంట‌నే సినిమా చేయాల‌నుకున్నారు. కానీ సూర్య వేర్వేరు క‌మిట్ మెంట్ల కార‌ణంగా వీలుప‌లేదు. దీంతో కంగువా త‌ర్వాతైనా చేద్దామ‌నుకున్నా! ఇప్పుడ‌ది వీలుప‌డ‌క‌పోవ‌డంతో సుధ ఈ గ్యాప లో ధృవ్ తో సినిమా చేసేలా ఒప్పందం చేసుకున్న‌ట్ల తెలుస్తోంది. ధృవ్ కూడా ఖాళీగా లేడు. మారి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇది పూర్త‌యిన వెంట‌నే సుధ కొంగ‌ర చిత్రానికి డేట్లు ఇస్తాడు. ప్ర‌స్తుతం సుధ బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ తో ఆకాశం నీహ‌ద్దు రా రీమేక్ చేస్తున్నారు. షూట్ ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. అలాగే ధృవ్ సినిమాకి సంబంధించి ఫైన‌ల్ వెర్ష‌న్ క‌థ ప‌నుల్లో బిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం. సుధ కొంగ‌ర వెంక‌టేష్ తో 'గురు' అనే స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ చిత్రాన్ని తెర‌కెక్కించి మంచి విజ‌యం అంధించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో వెంకీ బాక్సింగ్ కోచ్ గా న‌టించారు. 'గురు'..'ఆకాశం నీహ‌ద్దురా' సినిమాల‌తో సుధ కొంగ‌ర కి పాన్ ఇండియాలో మంచి గుర్తింపు ద‌క్కింది. మ‌రి చియాన్ త‌న‌యుడు కోసం వాస్త‌వ క‌థ‌తో వ‌స్తారా? క‌ల్పిత క‌థ‌ని తెస్తారా? అన్న‌ది చూడాలి.