Begin typing your search above and press return to search.

చరణ్‌ - సుక్కు మూవీ.. జక్కన్న పాత వీడియో వైరల్‌

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ లో రంగస్థలం సినిమా వచ్చి బ్లాక్‌ బస్టర్‌ విజయంగా నిలిచిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   26 March 2024 5:55 AM GMT
చరణ్‌ - సుక్కు మూవీ.. జక్కన్న పాత వీడియో వైరల్‌
X

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ లో రంగస్థలం సినిమా వచ్చి బ్లాక్‌ బస్టర్‌ విజయంగా నిలిచిన విషయం తెల్సిందే. రంగస్థలం సినిమా ప్రమోషన్ సమయంలోనే తమ కాంబోలో మరో సినిమా ఉంటుందని, దాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నట్లుగా దర్శకుడు సుకుమార్‌ స్వయంగా ప్రకటించాడు.

రంగస్థలం తర్వాత సుకుమార్‌ పుష్ప సినిమాను బన్నీ తో మొదలు పెట్టాడు. పుష్ప ను రెండు భాగాలుగా విడదీశాడు. ఇప్పటికే పుష్ప 1 విడుదల అయ్యింది. ఈ ఏడాది పుష్ప 2 ను విడుదల చేయబోతున్నారు. తాజాగా హోళీ సందర్భంగా రామ్‌ చరణ్ తో సుకుమార్ తన సినిమాను ప్రకటించాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు.

ఆర్‌సీ17 వర్కింగ్ టైటిల్ తో రూపొందబోతున్న ఈ సినిమా ను ఇదే ఏడాది చివర్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. చరణ్‌ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అంతా కూడా చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో అంటున్నారు. ఈ సమయంలో సోషల్‌ మీడియాలో రాజమౌళి పాత వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

ఆ వీడియో లో రాజమౌళి మాట్లాడుతూ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబోలో రాబోతున్న సినిమా గురించి మాట్లాడాడు. ఆ సినిమా ఓపెనింగ్‌ సీన్‌ నాకు తెలుసు. ఒక వేళ ఆ సన్నివేశం ఏంటి అనేది చెప్తే సుకుమార్ గారికి గుండె పోటు వస్తుందేమో.. కానీ ఆ సన్నివేశానికి ప్రేక్షకులు సీట్లలో ముందుకు జరిగి మరీ ఉత్కంఠతతో వణుకుతూ చూస్తారని రాజమౌళి పేర్కొన్నాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా రెండేళ్ల క్రితం రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. సుకుమార్‌ అంటే రాజమౌళికి అమితమైన అభిమానం. అలాంటి సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్ హీరోగా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రాజమౌళి గతంలో పేర్కొన్నాడు.

సినిమా ప్రారంభం కు ఇంకా చాలా సమయం ఉంది. అయినా కూడా రాజమౌళి ఎప్పుడో మాట్లాడిన మాటల వల్ల ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రాజమౌళికి తెలిసిన ఆ థ్రిల్లింగ్‌ ఓపెనింగ్‌ సీన్‌ ను చూడాలి అంటే ప్రేక్షకులు సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే.