Begin typing your search above and press return to search.

52 లో ప్ర‌పోజ‌ల్స్ ఆ హాట్ బ్యూటీకి సొంతం!

కానీ ఇలాంటి క్రేజీ భామ‌ల్నే హాట్ అప్పిరియ‌న్స్ తో ప‌క్క‌కు నెట్టేసింది 52 ఏళ్ల ట‌బు.

By:  Tupaki Desk   |   27 March 2024 9:10 AM GMT
52 లో ప్ర‌పోజ‌ల్స్ ఆ హాట్ బ్యూటీకి సొంతం!
X

బాలీవుడ్ లో ఎంతో మంది అంద‌గ‌త్తెలున్నారు. యువ నాయిక‌ల నుంచి సీనియ‌ర్ నాయిక‌ల వ‌ర‌కూ బ్యూటీ విష‌యంలో ఒక‌రికొక‌రు పోటీ ప‌డుతుంటారు. క‌రీనా క‌పూర్.. రాణీ ముఖ‌ర్జీ..శ్ర‌ద్దా క‌పూర్..క‌త్రినా కైఫ్.. జాన్వీ క‌పూర్..అలియాభ‌ట్ ఇలా ఎంతో మంది క్రేజీ భామ‌లున్నారు. బ్యూటీ విష‌యంలో భామా మ‌ణులెవ్వ‌రు త‌గ్గ‌రు. అంద‌మే అసూయ‌ప‌డేంత బ్యూటీ వీళ్ల సొతం. కానీ ఇలాంటి క్రేజీ భామ‌ల్నే హాట్ అప్పిరియ‌న్స్ తో ప‌క్క‌కు నెట్టేసింది 52 ఏళ్ల ట‌బు. కొంత కాలంగా ట‌బు ఏ రేంజ్ లో చెల‌రేగుతుందో తెలిసిందే.


ఆన్ ది స్క్రీన్ అయినా..ఆఫ్ ది స్క్రీన్ అయినా ట‌బు అందాల దాటి ఒకేలా ఉంటుంది ఇప్ప‌టికే ప్రూవ్ అయింది. `ది క్రూ` చిత్రం రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న కొద్ది ట‌బు అంత‌కంత‌కు నెట్టింట చెల‌రే గుతుంది. సినిమా స్టిల్స్ కి ధీటుగా ప్ర‌యివేటు ఫోటోల్ని నెట్టింట వ‌దులుతుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో ఇంట్రెస్టింగ్ పిక్ తో నెటింట్లోకి వ‌చ్చేసింది. ఎరుపు వ‌ర్ణం ఔట్ ఫిట్ లో ట‌బు న‌వ నాయిక‌ల్నే త‌ల‌పిస్తుంది.

అమ్మ‌డి బ్యూటీకి కుర్రాళ్లంద‌రికి మ‌తి పోతుంది. వీల్ పై అమ్మ‌డి హాట్ భంగిమకి ఫిదా అవుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌పోజ‌ల్స్ ఒక్కొక్క‌రుగా వ‌దులుతున్నారు. విల్ యూ మ్యారీ మీ అంటూ కుర్రాళ్లంతా ఎగ‌బ‌డుతున్నారు. ఐల‌వ్ యూ చెబుతూ నీ ప్రేమ‌కై స‌దా బానిస‌నంటూ త‌మ‌దైన శైలిలో ప్ర‌పోజ్ చేస్తున్నారు. ల‌వ్ సింబ‌ల్స్..మండుతోన్న ఎమోజీల‌ను పోస్ట్ చేసి త‌మ మ‌న‌సులో భావాలు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

52 ఏళ్ల వ‌య‌సులో ఇలా ప్ర‌పోజ‌ల్స్ రావ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఎంతో క్రేజ్ ఉంటే త‌ప్ప సాధ్యం కానిది. అందులో నేను ముందున్నానంటూ ట‌బు ఇలా మురిపిస్తుంది. మ‌రో రెండు రోజుల్లో ది క్రూ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఎగిరే విమానంలో అమ్మ‌డు చిలిపి దొంగ‌త‌నాలు ఎలా చేస్తుంద‌ని? అంతా ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.