Begin typing your search above and press return to search.

మా బాలయ్య నిజమైన 'లెజెండ్‌' మావా..!

బాలయ్య కెరీర్ లో మూడు సినిమాలు చాలా స్పెషల్‌ మరియు చాలా పెద్ద హిట్‌ అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   29 March 2024 6:54 AM GMT
మా బాలయ్య నిజమైన లెజెండ్‌ మావా..!
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్‌ మరియు అఖండ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వసూళ్ళు విషయంలో రికార్డుల మోత మోగించిన విషయం తెల్సిందే. బాలయ్య కెరీర్ లో మూడు సినిమాలు చాలా స్పెషల్‌ మరియు చాలా పెద్ద హిట్‌ అనడంలో సందేహం లేదు.

లెజెండ్ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ సభ్యులు పెద్ద ఎత్తున ఈవెంట్‌ ను నిర్వహించారు. బాలకృష్ణ, బోయపాటితో పాటు హీరోయిన్‌ ఇంకా పలువురు సినీ ప్రముఖులు మరియు సినిమాకు వర్క్ చేసిన నటీ నటులు పాల్గొన్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ.. మా లెజెంట్‌ లో నటించినందుకు జగపతి బాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆయన లెజెండ్‌ తర్వాత చాలా విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేశాడు. సినిమాలో ఒక సన్నివేశంలో గుర్రం తో గాజులు పగలగొట్టడం మీరు చూశారు. ఆ సన్నివేశంకు డూప్ లేకుండా నేనే చేశాను.

దర్శకుడు బోయపాటి డూప్‌ తో ఆ సీన్ చేయాలని మొదట అనుకున్నాడు. కానీ నేను సొంతంగానే ఆ సీన్ చేస్తాను అన్నాను. కొందరు యంగ్‌ హీరోలు కూడా చిన్న చిన్న యాక్షన్‌ సన్నివేశాలకు డూప్ లను వాడుతూ ఉంటారు. కానీ మా బాలయ్య అంత పెద్ద యాక్షన్‌ సన్నివేశానికి కూడా డూప్ లేకుండా సొంతంగా చేశాడు.. అందుకే మా బాలయ్య నిజమైన లెజెండ్‌ మావా.. అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో బాలయ్య, బోయపాటి కాంబోలో నాల్గవ సినిమా పట్టాలెక్కబోతుంది. వీరి కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.