Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ ఇయ‌ర్ పై ఇదే క్లారిటీ!

ఇలాంటి విష‌యాలు ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోరు కాబ‌ట్టి! ఈ సంగ‌తి ఆయ‌న వ‌ర‌కూ చేరిందా? లేదా? అన్న‌ది కూడా సందేహ‌మే.

By:  Tupaki Desk   |   24 April 2024 5:36 AM GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ ఇయ‌ర్ పై ఇదే క్లారిటీ!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన సంవ‌త్స‌రం విష‌యంలో అభిమానుల మ‌ధ్య చాలా కాలంగా క‌న్ ప్యూజన్ ఉంది. 1971 లో పుట్టాడ‌ని కొంద‌రంటుంటే? 1969 లో జ‌న్మించాడ‌ని మ‌రికొంత మంది వాదిస్తున్నారు. వాస్త‌వానికి ఈ డిస్క‌ష‌న్ ఇప్పడిది కాదు. చాలా కాలంగా జ‌రుగుతున్న‌దే. కానీ దీనిపై ఏనాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చింది లేదు. ఇలాంటి విష‌యాలు ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోరు కాబ‌ట్టి! ఈ సంగ‌తి ఆయ‌న వ‌ర‌కూ చేరిందా? లేదా? అన్న‌ది కూడా సందేహ‌మే.

తాజాగా ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ వ‌య‌సు టాపిక్ మ‌రోసారి చ‌ర్చ‌కొచ్చింది. అయితే ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో భాగంగా వ‌య‌సుపై ఇప్పుడో క్లారిటీ వ‌చ్చిందనుకోవ‌చ్చు. అత‌ని ఆధార్ కార్డు ఆధారంగా సెప్టెంబ‌ర్ 2-1968 లో జ‌న్మించిన‌ట్లు ఉంది. తేదీ తో స‌హా ఆధార్ కార్డులో ఉంది అంటే ఇదే వ‌య‌సు గా నిర్దారించుకోవ‌చ్చు. ఎందుకంటే ఏపీలో మొట్ట‌మొద‌టి సారి ఆధార్ కార్డులు ఇచ్చిన స‌మ‌యంలో కేవలం స‌వంత్స‌రం మాత్ర‌మే ప్రింట్ చేసి ఇచ్చేసారు. ఆ త‌ర్వాత కొంత కాలానాకి ఆధార్ లో మార్పులు చేర్పుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అవ‌కాశం ఇచ్చింది.

అప్ప‌టి నుంచి అస‌లైన పుట్టిన తేదీ, నెల‌, సంవ‌త్స‌రం తో కొత్త ఆధార్ కార్డులు జారీ అవుతున్నాయి. పీకే ఆధార్ కార్డులో పుట్టిన తేదీ..నెల ఉంది కాబ‌ట్టి ఇదే అత‌ని వాస్త‌వంగా పుట్టిన సంవ‌త్స‌రంగా చెప్పొచ్చు. అంటే స‌రిగ్గా ఈరోజుకి ప‌వ‌న్ వ‌య‌సు 55 సంవ‌త్స‌రాల 7 నెల‌ల 22 రోజులు. మ‌రో ఐదు సంవ‌త్స‌రాలు గ‌డిస్తే ష‌ష్టి పూర్తి లోకి ఎంట‌ర్ అయిన‌ట్లే. అలాగే గూగుల్ లో కూడా ఇదే డేటా చూపిస్తుంది. ప్ర‌తీ ఏడాది అభిమానులు సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ పుట్టిన రోజు వేడుక‌లు కూడా గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేస్తుంటారు. సోషల్ మీడియా వేదిక‌గా ఆ రోజున విషెస్ తెలియ‌జేస్తుంటారు.

ఇక ప‌వ‌న్ పెద్ద‌న్న‌య్య చిరంజీవి వ‌య‌సు 68 కాగా..చిన్న అన్న‌య్య నాగ‌బాబు ఏజ్ 62 సంవ‌త్స‌రాలు. చిరు-ప‌వ‌న్ మ‌ధ్య 13 ఏళ్ల వ్య‌త్యాసం ఉంది. నాగ‌బాబు-ప‌వ‌న్ మ‌ధ్య ఏడేళ్లు గ్యాప్ ఉన్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. పిఠాపురంలో గెలుపే ల‌క్ష్యంగా ఆ నియోజక వ‌ర్గంలో ప‌గ‌లు..రాత్రి తేడా లేకుండా తిరుగుతున్నారు.