Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?

అతను అందించే ఎంటర్టైన్మెంట్ డీజే టిల్లు కంటే రెట్టింపు ఉంటుందని ప్రమోషన్స్ లో చెబుతూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 March 2024 4:43 AM GMT
టిల్లు స్క్వేర్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?
X

సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన క్రేజియస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకి సీక్వెల్ గా ఈ మూవీ సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించడంతో క్రేజ్ మరింత పెరిగింది. టిల్లు క్యారెక్టర్ కి యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు. అతను అందించే ఎంటర్టైన్మెంట్ డీజే టిల్లు కంటే రెట్టింపు ఉంటుందని ప్రమోషన్స్ లో చెబుతూ వస్తున్నారు.

సినిమాపై ఉన్న హైప్ కారణంగా ఏకంగా 30 కోట్లకి పైనే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ అమ్ముడైపోయాయని టాక్ వస్తోంది. థీయాట్రికల్ బిజినెస్ లెక్కలు చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల వ్యాపారం జరిగిందంట. సిద్దు జొన్నలగడ్డ ఇమేజ్ పరంగా చూసుకుంటే అతని మార్కెట్ కి మించి ఈ సినిమాపై బిజినెస్ అయ్యిందని చెప్పాలి. నిజానికి డీజే టిల్లు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది 30 కోట్లు.

ఇప్పుడు టిల్లు స్క్వేర్ జరిగిన థీయాట్రికల్ బిజినెస్ 30 కోట్లు జరిగినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మూవీకి 60 కోట్ల వరకు గ్రాస్ వస్తేనే హిట్ క్యాటగిరీలో చేరుతుంది. హిట్ మూవీ సీక్వెల్ కావడంతో పాటు టిల్లు స్క్వేర్ టీజర్, ట్రైలర్ లతో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మూవీకి స్ట్రాంగ్ ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. ఫస్ట్ డే వచ్చిన టాక్ బట్టి సినిమా లాంగ్ రన్ ఎంత వరకు కొనసాగుతుందనేది డిసైడ్ అవుతుంది.

చిత్ర యూనిట్ అయితే డీజే టిల్లు మించి టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. టిల్లు క్యారెక్టర్ ఈ సారి ఎక్స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుందని నమ్ముతున్నారు. దీనికి అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో అదనపు ఆకర్షణగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అనుపమ హాట్ అండ్ బోల్డ్ పెర్ఫార్మెన్స్ కి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా హిట్ అయితే టిల్లు సిరీస్ లో నెక్స్ట్ పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నిర్మాత నాగవంశీ టిల్లు క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ అందించేంత వరకు ఈ సిరీస్ లు సినిమాలు వస్తాయని చూచాయగా చెప్పారు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో టిల్లు స్క్వేర్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. వీకెండ్ పూర్తయితే సినిమా అసలు రిజల్ట్ ఏంటనేది తెలిసే అవకాశం ఉంటుంది.