Begin typing your search above and press return to search.

డబుల్‌ ఇస్మార్ట్‌ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీ వచ్చి అయిదేళ్లు కావస్తుంది.

By:  Tupaki Desk   |   4 May 2024 9:52 AM GMT
డబుల్‌ ఇస్మార్ట్‌ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌
X

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీ వచ్చి అయిదేళ్లు కావస్తుంది. ఇస్మార్ట్‌ శంకర్‌ సూపర్‌ హిట్‌ గా నిలవడంతో పాటు రామ్ మరియు పూరికి కెరీర్‌ లో బూస్ట్‌ ఇచ్చింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబో మూవీ రాబోతుంది. అది కూడా సీక్వెల్‌ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇప్పటికే ఇస్మార్ట్‌ శంకర్‌ కి సీక్వెల్‌ డబుల్‌ ఇస్మార్ట్‌ ప్రకటింపబడింది. షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది. తాజాగా ముంబైలో ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ ను ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ఈ షెడ్యూల్‌ లో రామ్‌ మరియు సంజయ్‌ దత్‌ లతో పాటు ముఖ్య నటీనటులు పాల్గొనబోతున్నారు. ఈసారి రెట్టింపు వినోదాన్ని అందించే విధంగా డబుల్‌ ఇస్మార్ట్‌ ఉంటుందని యూనిట్‌ సభ్యులు ధీమాగా చెబుతున్నారు. యాక్షన్‌ తో పాటు పూరి మార్క్‌ టేకింగ్‌ తో డబుల్‌ ఇస్మార్ట్‌ ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

తాజాగా ప్రారంభం అయిన ముంబై షెడ్యూల్ తో సినిమా షూటింగ్‌ మెజార్టీ పార్ట్‌ పూర్తి అయినట్లుగా భావించవచ్చు. అతి త్వరలోనే సినిమా షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయాలని పూరి భావిస్తున్నాడు.

జూన్‌ నెలలో సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికి సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా పూరి మేకింగ్‌ చేస్తున్నాడు. అందుకే విడుదల విషయంలో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవం.

ముంబై షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత కొత్త విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించే అవకాశం ఉంది. పూరితో కలిసి ఈ సినిమా ను ఛార్మి నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమా కు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇస్మార్ట్‌ శంకర్‌ కి కూడా మణిశర్మ సంగీతాన్ని అందించగా ఆ మ్యూజిక్ ఆల్బం సూపర్ హిట్‌ అయ్యింది. డబుల్‌ ఇస్మార్ట్‌ కి కూడా మంచి మ్యూజిక్ ను మణిశర్మ ఇస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు.