Begin typing your search above and press return to search.

కొండ కోన‌ల్లోకి జంప్ అయిపోయారు!

వ‌రుణ్- లావ‌ణ్య జంట‌ పర్వతారోహణకు బయలుదేరారని ఈ ఫోటోల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

By:  Tupaki Desk   |   25 March 2024 2:21 PM GMT
కొండ కోన‌ల్లోకి జంప్ అయిపోయారు!
X

ప్రేమ జంట వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి గత ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్ల‌యాక ఈ అంద‌మైన‌ జంట‌ రొమాంటిక్ లైఫ్ జర్నీకి సంబంధించిన ప్ర‌తిదీ సోష‌ల్ మీడియాల్లోకి వ‌చ్చేస్తోంది. అక్క‌డ వారి ఫోటోలు, వీడియోలు అభిమానులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ అంద‌మైన జంట ఇన్ స్టా పోస్ట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.


వ‌రుణ్- లావ‌ణ్య జంట‌ పర్వతారోహణకు బయలుదేరారని ఈ ఫోటోల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఇది నిజంగా సాహసోపేతమైన ప్ర‌యాణం. పెళ్ల‌యిన జంట అడ్వెంచ‌ర్ ట్రిప్ గా దీనిని చూడాలి. వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌ ట్రయల్స్‌లో `సూర్యాస్తమయాలను వెంబడిస్తున్నాం!` అనే ఆస‌క్తిక‌ర‌ శీర్షికతో వరుస ఫోటోలను పోస్ట్ చేశాడు. ఈ ఆకర్షణీయమైన ఫోటోలలో, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి కలిసి పర్వతారోహణ చేస్తున్నప్పుడు గొప్ప అవుట్‌డోర్ లొకేష‌న్ల‌ను ప‌రిచ‌యం చేసారు. వారి చిరునవ్వులు ఆనందం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. అంద‌మైన‌ జంట సాహసోపేత స్ఫూర్తివంత‌మైన అన్వేష‌ణ అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. అభిమానులు ఈ ఫోటోల‌పై స్పందిస్తూ వారిని ప్ర‌శంసించారు. మీరిద్దరూ (హృదయ ఎమోజి) అందమైన జంట అని పొగిడేశారు. కొండ కోన‌ల్లోకి జంప్ అయిపోయారు అంటూ అభిమానులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... వరుణ్ తేజ్ చివరిగా ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ `ఆపరేషన్ వాలెంటైన్`లో కనిపించాడు. ఇది నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన చిత్రం. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ సాధించింది. అంచనాల స్థాయిలో ఆడింది. ప్రస్తుతం `మట్కా` చిత్రీక‌ర‌ణ‌ కోసం వ‌రుణ్‌ సిద్ధమవుతున్నాడు. ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెర‌కెక్కుతోంది. మక్తా కింగ్ రతన్ ఖత్రి పాత్రలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. 1950, 1960ల కాలంలో సాగే చిత్ర‌మిది. ఈ సినిమా నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసారు. ఇప్పుడు షూటింగ్ ను తిరిగి ప్రారంభించ‌నున్నారు.