Begin typing your search above and press return to search.

మాట నిల‌బెట్టుకుంటే సంచ‌ల‌న‌మే!

కోలీవుడ్ స్టార్ విజ‌య్ తో చివ‌రి ఛాన్స్ కోసం ఎంత‌మంది స్టార్ డైరెక్ట‌ర్లు క్యూలో ఉన్నారో తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 April 2024 11:30 PM GMT
మాట నిల‌బెట్టుకుంటే సంచ‌ల‌న‌మే!
X

కోలీవుడ్ స్టార్ విజ‌య్ తో చివ‌రి ఛాన్స్ కోసం ఎంత‌మంది స్టార్ డైరెక్ట‌ర్లు క్యూలో ఉన్నారో తెలిసిందే. కార్తిక్ సుబ్బరాజ్..నెల్స‌న్ దిలీప్ కుమార్..లొకేష్ క‌న‌గ‌రాజ్.. మిత్ర‌న్ ఇలా పేరున్న వారంతా చివ‌రి ఛాన్స్ త‌న‌దేనంటూ ఎవ‌రికి వారు ధీమాగా క‌నిపిస్తున్నారు. వీళ్లంద‌రిలోక‌ల్లా! నెల్స‌న్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా పెద్ద పెద్ద ఛాలెంజ్ లే విసురుతున్నాడు. విజ‌య్ డేట్లు కోసం తాను ప్ర‌యోగించాల్సిన అస్త్రాల‌న్నింటిని ప్రయోగిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

విజ‌య్ త‌న‌కి ఛాన్స్ ఇస్తే గ‌నుక టాలీవుడ్ నుంచి సూప‌ర్ స్టార్ మ‌హేష్‌...బాలీవుడ్ నుంచి అమితాబ‌చ్చ‌న్ ని..మాలీవుడ్ నుంచి మమ్ముటిని..లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార లాంటి వారిని ఒకేతాటిపైకి తీసుకొచ్చి విజ‌య్ సినిమా తెర‌కెక్కిస్తాన‌ని ప్రామిస్ చేసాడు. నెల్స‌న్ ఇంత క‌సిగా ఉండ‌టానికి కార‌ణం లేక‌పోలేదు. `బీస్ట్` సినిమాని విజ‌య్ - నెల్స‌న్ ని ఎంత‌గానో న‌మ్మి చేసాడు. భారీ బ‌డ్జెట్ సినిమా కూడా. కానీ రిలీజ్ అనంత‌రం ప‌రాజ‌యం చెందింది.

ఈ విష‌యంలో నెల్స‌న్ ఎంతో బాధ‌ప‌డ్డాడు. విజ‌య్ స్వ‌యంగా ఫోన్ చేసి మ‌న‌సులో ఎలాంటి ఉద్దేశం పెట్టుకోవ‌ద్ద‌ని కొండంత భ‌రోసా క‌ల్పించాడు. మ‌రో సినిమా చేద్దామ‌ని కూడా అన్నాడు. ఆ మాట‌తో నెల్స‌న్ త‌న‌ని న‌మ్మి అవ‌కాశం ఇచ్చిన హీరోకి ప్లాప్ చిత్రం ఇచ్చాన‌ని మ‌రింత గిల్టీగా ఫీల‌య్యాడు? అందుకే సెకెండ్ ఛాన్స్ ఇస్తే కొండ‌ను సైతం పిండిని చేస్తాన‌నే కాన్పిడెన్స్ తో ఉన్నాడు. మ‌హేష్ - విజ‌య్ మ‌ధ్య మంచి స్నేహం కూడా ఉంది.

ఇద్ద‌రు ఒక‌రి సినిమాల్ని ఒక‌రు రీమేక్ చేసుకున్న సంద‌ర్భాలున్నాయి. ఆ న‌మ్మ‌కంతోనే విజ‌య్ ఛాన్స్ ఇస్తే మ‌హేష్ ఆ సినిమాలో భాగం చేస్తానంటున్నాడు. కానీ మ‌హేష్ అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చే టైప్ కాదు. ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం క‌లిసి న‌టించింది ఇద్ద‌రు స్టార్లతో మాత్ర‌మే. వారే సూప‌ర్ స్టార్ కృష్ణ ఒక‌రు అయితే...విక్ట‌రీ వెంక‌టేష్ మరొక‌రు. ఆ త‌ర్వాత మ‌హేష్ ఏ హీరోతో క‌లిసి న‌టించ‌లేదు. అది సాధ్యం కాద‌ని ఏ మేక‌ర్ కూడా ప్ర‌య‌త్నించ‌లేదు. కానీ నెల్స‌న్ మాత్రం చాలా న‌మ్మ‌కంతో! మ‌హేష్ ని తీసుకొస్తాన‌ని అంటున్నాడు. మ‌రి అత‌డి అంత న‌మ్మ‌కం ఏంటో? తెలియాలంటే విజ‌య్ ఛాన్స్ ఇవ్వాలి.