Begin typing your search above and press return to search.

విల‌నీగా నేష‌న‌ల్ అవార్డు విన్నర్ సిద్ద‌మే!

చేసిన కొన్ని సినిమాల‌కే అత్యంత వేగంగా ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకుంది.

By:  Tupaki Desk   |   24 April 2024 6:14 AM GMT
విల‌నీగా నేష‌న‌ల్ అవార్డు విన్నర్ సిద్ద‌మే!
X

నేష‌న‌ల్ అవార్డుతో ఒక్క‌సారిగా ఇండియా అంత‌టా సంచ‌ల‌న‌మైన బ్యూటీ కృతిస‌న‌న్. బాలీవుడ్ లో ఎంతో మంది భామ‌లున్నా! వాళ్లెవ్వ‌రికీ రాని ఛాన్స్ కృతి ట్యాలెంట్ కి ద‌క్కింది. ఒక్క అవార్డు ఆమె స్థాయినే మార్చేసింది. చేసిన కొన్ని సినిమాల‌కే అత్యంత వేగంగా ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకుంది. ఈ అమ్మ‌డు కెరీర్ జ‌ర్నీ ముందుగా టాలీవుడ్ లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ నుంచే బాలీవుడ్ కి వె ళ్లి స‌క్సెస్ అయింది. 'వ‌న్ నేనొక్క‌డినే'..'దోచెయ్' లాంటి సినిమాల‌తో ప‌రిచ‌య‌మైన బ్యూటీ ఆ ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా `ఆదిపురుష్` లో సీత‌మ్మ‌గా మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది.


సినిమా హిట్ అయితే మంచి పేరొచ్చేది. కానీ ఫ‌లితం మ‌రోలా ట‌ర్న్ చేసింది. ఇక బాలీవుడ్ కెరీర్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగిపోతుంది. ఇటీవ‌లే ది క్రూ తో మ‌రో స‌క్సెస్ ఖాతాలో వేసుకుంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రంగా రిలీజ్ అయిన సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అమ్మ‌డి కెరీర్ లో ఇదో కొత్త ట‌ర్నింగ్ పాయింట్. అవార్డు అందుకున్న వేళ ఈ ర‌క‌మైన స‌క్సెస్ అమ్మ‌డి స్టార్ డ‌మ్ ని మ‌రింత రెట్టింపు చేస్తుంది.

ఈ నేప‌థ్యంలో పాత్ర‌ల విష‌యంలో కొత్తగాను ప్ర‌యాణం చేయాల‌న్న కోర్కెను బ‌యట పెట్టింది. ప్రేమ క‌థ‌లు..కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ లు ఇలా ప్ర‌తీ జాన‌ర్ లో న‌టించాను. కానీ పూర్తిగా యాక్ష‌న్ నేప‌థ్యంలోనూ సినిమాలు చేయాల‌ని ఉంది. కొన్ని సినిమాల్లో యాక్ష‌న్ పాత్ర‌లు చేసినా అవి పూర్తి స్థాయిలో లేవు. వాటితో నేను కూడా సంతృప్తి చెంద‌లేదు. వీటితో పాటు నెగిటివ్ పాత్ర‌లు చేయాల‌ని ఉంది. కుదిరితే విల‌నీగా కూడా దిగిపోతాను. న‌టిగా అన్నిర‌కాల పాత్ర‌లు పోషించాలి.

అందులో నెగిటివ్ పాత్ర‌కి మ‌రింత స్కోప్ ఉంటుంది. న‌టుల‌కు అలాంటి పాత్ర‌లు ఎంతో కీలకం. అవి వ‌చ్చిన‌ప్పుడు నో చెప్ప‌కుండా న‌టించ‌య‌డ‌మే. నేను అలాంటి అవ‌కాశం కోస‌మే ఎదురు చూస్తున్నాను. ఇందులో భిన్న కోణాలుంటాయి. ఇలాంటి పాత్ర‌లు పోషిచ‌డం స‌వాల్ గా ఉంటుంది. నేర్చుకోవ‌డానికి అవ‌కాశం ఉన్న పాత్ర‌లు ఇవే` అని తెలిపింది.