Begin typing your search above and press return to search.

విశ్వక్ సేన్ 'లైలా'.. అంతా కలర్ ఫుల్ గా!

టాలీవుడ్ లో వరుస చిత్రాలతో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ దూసుకెళ్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు

By:  Tupaki Desk   |   29 March 2024 11:28 AM GMT
విశ్వక్ సేన్ లైలా.. అంతా కలర్ ఫుల్ గా!
X

టాలీవుడ్ లో వరుస చిత్రాలతో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ దూసుకెళ్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. హీరోగానే కాకుండా దర్శక, నిర్మాణ, రచన బాధ్యతలు నిర్వర్తిస్తూ మల్టీ టాలెంటెడ్ గా రానిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తెలుగు యంగ్ హీరోల్లో విశ్వక్ క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ బెస్ట్ పొజిషన్ కు చేరుకోవడంలో సక్సెస్ అవుతున్నారు.

ఇటీవల గామితో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్న విశ్వక్.. త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సందడి చేయనున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. వేసవి కానుకగా మే17వ తేదీన విడుదల కానుంది. నేడు విశ్వక్ బర్త్ డే సందర్భంగా పలు సినిమాల వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే VS 10 అప్డేట్ రాగా.. తాజాగా VS 12 అప్డేట్ వచ్చేసింది.

VS 12 కోసం విశ్వక్ సేన్.. దర్శకుడు రామ్ నారాయణ్ తో చేతులు కలిపారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్.. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని రోల్ లో కనిపించనున్నారు. మాస్ కా దాస్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు మేకర్స్. విశ్వక్ కు బర్త్ డే విషెస్ చెబుతూ టైటిల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఇవి సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. రెండింట్లో పూలు, సీతాకోక చిలుకలు, అద్దం, కొవ్వొత్తి, మేకప్ కిట్, రేడియో, చార్మినార్, తుపాకీ, నెత్తురోడుతున్న కత్తి మొదలైనవి ఉన్నాయి. సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే విశ్వక్ పలుమార్లు చెప్పినట్లు.. ఈ మూవీ టైటిల్ ను లైలాగా ఖరారు చేశారు.

ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. తనిష్క్ బాగ్చి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. అన్వర్ అలీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. వాసుదేవ మూర్తి రచయితగా పనిచేస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్.. లేడీ గెటప్ లో నటిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. చూస్తూ ఉంటే విశ్వక్ సరికొత్తగా ఆకట్టుకోబోతున్నట్లు అర్ధమవుతుంది. మరి ఈ మూవీతో మాస్ కా దాస్.. ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.