Begin typing your search above and press return to search.

పోలింగ్ రోజు బయట పడ్డ రాఖీ భాయ్‌ న్యూ లుక్‌

కన్నడ రాక్‌ స్టార్‌ యశ్‌ కేజీఎఫ్‌ తో పాన్‌ ఇండియా స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నాడు.

By:  Tupaki Desk   |   27 April 2024 10:33 AM GMT
పోలింగ్ రోజు బయట పడ్డ రాఖీ భాయ్‌ న్యూ లుక్‌
X

కన్నడ రాక్‌ స్టార్‌ యశ్‌ కేజీఎఫ్‌ తో పాన్‌ ఇండియా స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నాడు. కేజీఎఫ్‌ 2 మూవీ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేయడంతో యశ్ తదుపరి సినిమా ఏంటి అంటూ దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు మరియు మీడియా వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూశారు.

ఇటీవలే గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో యశ్‌ సినిమా ప్రారంభం అయ్యింది. ఇన్ని రోజులు వెయిట్‌ చేసినందుకు యశ్‌ కి ఖచ్చితంగా ఓ మంచి సబ్జెక్ట్‌ దొరికే ఉంటుంది అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. కేజీఎఫ్‌ కోసం దాదాపు నాలుగు ఏళ్లు ఒకే లుక్‌ లో కనిపించిన యశ్‌ తాజాగా కొత్త లుక్‌ లోకి మారాడు.

కర్ణాటకలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు భార్య తో పాటు యశ్ పోలింగ్‌ బూత్‌ కి వెళ్లాడు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత యశ్‌ తన భార్య తో కలిసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చాడు. ఇతరులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

తాజా ఫోటోల్లో యశ్‌ లుక్ సర్‌ప్రైజింగ్ గా ఉంది. ఇన్నాళ్లు ఫుల్ గడ్డంతో కనిపించిన యశ్‌ ఇప్పుడు సగం గడ్డం తీసి వేశాడు. కొత్త తరహా గడ్డం లుక్‌ లో కనిపించాడు. జుట్టు కనిపించకుండా బ్లాక్ క్యాప్‌ ధరించిన యశ్‌ న్యూ లుక్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

కేజీఎఫ్ లో కాస్త మాసీ లుక్ లో కనిపించిన యశ్‌ తాజాగా నటిస్తున్న గీతూ మోహన్‌ దాస్‌ సినిమాలో కాస్త ట్రెండీగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ సినిమా యొక్క లుక్ పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పాన్ ఇండియా రేంజ్ మూవీగా రూపొందుతున్న ఆ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

కేజీఎఫ్‌ లో యశ్‌ కనబర్చిన యాక్షన్‌ నటన ప్రతిభ కు దేశ వ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. విదేశాల్లో కూడా కేజీఎఫ్‌ సినిమా భారీగా వసూళ్లు సాధించింది. కనుక ఈ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండాలనే ఉద్దేశ్యంతో గీతూ మోహన్‌ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.