Begin typing your search above and press return to search.

మీకు తెలుసా : ప్రపంచంలో ది బెస్ట్ 50లో 9 మనవే

ప్రపంచంలోని అన్ని వంటకాలలో భారతీయ వంటకాలకు ఆదరణ ఎక్కువ. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు.

By:  Tupaki Desk   |   26 April 2024 11:30 PM GMT
మీకు తెలుసా : ప్రపంచంలో ది బెస్ట్ 50లో 9 మనవే
X

ప్రపంచంలోని అన్ని వంటకాలలో భారతీయ వంటకాలకు ఆదరణ ఎక్కువ. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. అలాగే భారత్ లోని అనేక వంటకాలు అనేక మంది భోజన ప్రియుల ఆదరణను చూరగొన్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఫుడ్ ట్రావెల్ గైడ్ విడుదల చేసిన ‘టేస్ట్ అట్లాస్’ పలు భారతీయ వంటకాలకు తన 50 వరల్డ్ బెస్ట్ వంటకాలలలో 9 భారతీయ వంటకాలకు చోటిచ్చింది.

దేశంలో ఎంతో ప్రసిద్ది గాంచిన కీమా టాప్ టెన్ లిస్ట్ లోకి చొరబడి 6వ స్థానంలో నిలిచింది. బెంగాల్ వాసుల ప్రముఖ వంటకం చింగ్రీ మలాయ్ కర్రీ 18వ స్థానం దక్కించుకోగా, కుర్మా వంటకం 22వ స్థానం, విందాలు వంటకం 26వ ర్యాంక్ చేజిక్కించుకోగా, శాఖాహారులు ఎక్కువగా ఆదరించే దాల్ తడ్కా 30 ర్యాంక్ దక్కించుకున్నది. ఇక సాగ్ పన్నీర్ 32, షాహీ పన్నీర్ 34. మిసాల్ 38 ర్యాంకులు సాధించగా ఇండియన్ దాల్ ఈ జాబితాలో చివరి వరసలో నిలవడం విశేషం. వీటన్నింటిలో థాయిలాండ్ కు చెందిన థాయ్ పానెంగ్ కర్రీ జాబితాలో తొలి స్థానం సంపాదించింది.

ఇక దీంతో పాటు కొద్ది రోజుల క్రితం ఇదే సంస్థ విడుదల చేసిన ఉత్తమ రైస్ ఫుడ్డింగ్ ర్యాంకులలో మూడు భారతీయ తీపి వంటకాలకు టాప్ టెన్ లో చోటు దక్కింది. ఉత్తర భారతీయులు ఎక్కువగా చేసుకునే పిర్నీకి నాలుగో స్థానం దక్కగా, భారతీయులు వివిధ రకాలుగా ఖీర్ పాయసం 5వ స్థానంలో, దక్షిణ భారతీయులు సంక్రాంతికి ఇష్టంగా చేసుకునే చక్కెర పొంగలి 9వ స్థానం సంపాదించింది. పుర్రెకో బుద్ది .. జిహ్వకో రుచి అని భారతదేశంలో నానుడి. భారతీయ వంటకాలు ప్రపంచంలో ఇంతగా పేరు సంపాదించడం నిజంగా ఆనందదాయకం.