Begin typing your search above and press return to search.

క్యాన్సర్ ను గుర్తించే పరికరం 'మియా'

బ్రిటన్ లో 10 వేల మంది మహిళల మామోగ్రామ్ లను మియా పరీక్షించింది. మామోగ్రామ్ అనేది రొమ్ము క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు ఉపయోగించే ఎక్స్ రే పరికరం.

By:  Tupaki Desk   |   27 March 2024 12:30 AM GMT
క్యాన్సర్ ను గుర్తించే పరికరం మియా
X

ప్రపంచంలో మందులు లేని రోగాలు రెండు. ఒకటి క్యాన్సర్ రెండోది ఎయిడ్స్. ఎయిడ్స్ కనుమరుగు అవుతోంది. క్యాన్సర్ మాత్రం పెరుగుతోంది. ఏటా కొన్ని లక్షల మంది క్యాన్సర్ లక్షణాలతో చనిపోతున్నారు. అత్యంత ప్రమాకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి కావడం గమనార్హం. క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తేనే నివారణ సాధ్యమవుతుంది.

బ్రిటన్ లో 10 వేల మంది మహిళల మామోగ్రామ్ లను మియా పరీక్షించింది. మామోగ్రామ్ అనేది రొమ్ము క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు ఉపయోగించే ఎక్స్ రే పరికరం. 11 మంది రోగుల్లో మియా లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది. మనిషి కంటికి కనిపించని ఇలాంటి ట్యూమర్లను సింథటిక్ టెక్నాలజీ టూల్ మియా. మియా పరికరం క్యాన్సర్ ట్యూమర్లను గుర్తించిన రోగుల్లో బార్బరా ఒకరు.

మియా టూల్ ద్వారా త్వరగా ట్యూమర్ ను గుర్తించడంలో ముందుంటుంది. 15 ఎంఎం కంటే చిన్నగా ఉన్నప్పుడే ట్యూమర్లను గుర్తిస్తే వచ్చే ఐదేళ్లలో వ్యాధి వచ్చినా బతికే అవకాశాలు 90 శాతం ఉంటాయి. ఏఐ పరికరం లేకపోతే మూడేళ్ల తరువాత మామోగ్రామ్ పరీక్ష వరకు క్యాన్సర్ ట్యూమర్ బయటపడదని తెలుస్తోంది. మియా పరికరాలు 14 రోజుల నుంచి 3 రోజులకు తగ్గిస్తాయని తేల్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలపై లక్షల మమోగ్రామ్ లపై శిక్షణ ఇచ్చారు. ఏఐ పరికరాల వల్ల హెల్త్ కేర్ కు తోడ్పడుతుందని తెలుసుకున్నారు. ఏడాదికి సగటున 5 వేల స్కాన్లను బ్రెస్ట్ క్యాన్సర్ డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సింగిల్ సెషన్ లో 100 స్కాన్లు చేస్తున్నారు. ఇలా క్యాన్సర్ ముప్పు వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది.

మియా పరికరం లోపాలు కూడా ఉంటున్నాయి. మియా ట్రయల్ కేవలం ఒక ప్రాంతంలో చేశారు. ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన ఎక్కువవుతోంది. సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించుకుని బ్రిటన్ లోని క్యాన్సర్ రీసెర్చ్ కు చెందిన హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గిందన్నారు.