Begin typing your search above and press return to search.

300 ఎక‌రాలు.. 49 గ‌దుల‌తో అంబానీ లండ‌న్ ఇల్లు

ముఖేష్ అంబానీ - నీతా అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒక జంట‌.

By:  Tupaki Desk   |   19 April 2024 12:30 AM GMT
300 ఎక‌రాలు.. 49 గ‌దుల‌తో అంబానీ లండ‌న్ ఇల్లు
X

ముఖేష్ అంబానీ - నీతా అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒక జంట‌. వీరికి ముగ్గురు పిల్లలు.. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ. బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు ఈ కుటుంబం సొంతం. అంబానీ కుటుంబం ముంబై ఇంటి పేరు యాంటిలియా.. దక్షిణ బొంబాయిలో ఉంది. యాంటిలియాతో పాటు.. ముఖేష్ అంబానీ - నీతా అంబానీ కూడా లండన్‌లో విశాలమైన ఇంటిని కలిగి ఉన్నారు.


ఏప్రిల్ 2021లో ముఖేష్ అంబానీ లండన్‌లోని స్టోక్స్ పార్క్ వారసత్వ ఆస్తిని కొనుగోలు చేశారు. విలాసవంతమైన ఈ లండన్ ఇంటిని రూ.592 కోట్లకు కొనుగోలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ భారీ పెట్టుబడి భారతదేశ ప్రఖ్యాత హాస్పిటాలిటీ పరిశ్రమ పాదముద్రను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి సహాయపడుతుందని పేర్కొంది.


లండన్‌లోని ముఖేష్ అంబానీ ఇల్లు ఒక చారిత్రాత్మకమైన ఎస్టేట్.. అంతకుముందు కింగ్ సోదరులు - చెస్టర్, హెర్ట్‌ఫోర్డ్ , విట్నీలకు చెందినది - వారు కుటుంబ వ్యాపారంలో ఉద్ధండులు. ఈ ఆస్తిని 1988లో కొనుగోలు చేశారు.


లండన్‌లోని స్టోక్స్ పార్క్ వారసత్వ సంపద 300 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రధాన లండన్ నుండి 40 కి.మీ.ల దూరంలో ఈ ఆస్తి ఉంది. ఇది 49 గదులు..13 టెన్నిస్ కోర్టులు.. పూల్స్.. సూట్‌లతో కూడిన ఐదు నక్షత్రాల హోటల్ ఇది. అంబానీలు కూడా ఆ ప్రాంగణంలో ఒక మినీ-హాస్పిటల్‌ను నిర్మించాలని యోచిస్తున్నారు. ఇంటిలో భారీ గ్రాస్ కోర్టు - వంతెన, సరస్సు కూడా ఉన్నాయి.


స్టోక్స్ పార్క్ ఇంట్లో రెండు జేమ్స్ బాండ్ చిత్రాలను కూడా తెర‌కెక్కించడం విశేషం. టుమారో నెవర్ డైస్ (1997లో) , గోల్డ్ ఫింగర్ (1964లో) సినిమాల‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను ఈ ఇంట్లో తెర‌కెక్కించారు. స్టోక్ పార్క్ ఎస్టేట్ కింగ్ ఫ్యామిలీ-UK యాజమాన్యంలోని ఇంటర్నేషనల్ గ్రూప్ (IG) యాజమాన్యంలో ఉంది. దీనిని అంబానీ కుటుంబం కొనుగోలు చేసింది. నిజానికి ఇది 1908 నుండి కంట్రీ క్లబ్ గ్రూప్ ఆధీనంలో ఉండేది. అదే సంవత్సరంలో ఇది ప్రైవేట్ ఇంటి నుండి కంట్రీ క్లబ్‌గా మారింది. త‌ర్వాత స్టార్ హోటల్ గా మారింది. అటుపై అంబానీల చేతికి వ‌చ్చింది. స్టోక్ పార్క్ ఎస్టేట్ 900 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన సంపన్న భవనం.