Begin typing your search above and press return to search.

బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించండి... దిల్ రాజు వీడియో వైరల్!

అవును... తాజాగా దిల్ రాజు.. నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఒక వీడియోని విడుదల చేశారు

By:  Tupaki Desk   |   24 April 2024 2:09 PM GMT
బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించండి... దిల్ రాజు వీడియో వైరల్!
X

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా దాదాపు ఎవరూ ఊహించని విధంగా అన్నట్లుగా నిర్మాత దిల్ రాజు ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో భాగంగా... వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... తాజాగా దిల్ రాజు.. నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఒక వీడియోని విడుదల చేశారు. ఈ సమయంలో ఆ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆరోసారి ఆయాను గెలిపించాలని.. ఫలితంగా నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ క్రమంలోనే... బాలినేనికి అంతా ఓటువేసి గెలిపించాలని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఒంగోలును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారు అని మొదలుపెట్టిన దిల్ రాజు... అలాగే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేస్తూ, వారి శాఖ ద్వారా ఎంతో డెవలప్మెంట్ చేశారని అన్నారు. అదేవిధంగా ఇటీవల జగన్ సారధ్యంలో మంత్రిగా సక్సెల్ ఫుల్ గా బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు.

ఈ సమయంలో వైసీపీ నుంచి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన మరోసారి పోటీ చేస్తున్నారని చెప్పిన దిల్ రాజు... తప్పకుండా మీ అమూల్యమైన ఓటు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వేసి గెలిపించగలరని ప్రార్థన అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ వీడియో హాట్ టాపిక్ గా మారుతోంది! ఇదే క్రమంలో... ఇటీవల బాలినేని శ్రీనివాస్ రెడ్డిపైన ఒక డాక్యుమెంటరీ తీసినట్లు చెప్పిన దిల్ రాజు ఆ వీడియో యూట్యూబ్ లో ఉందని వెల్లడించారు.

ఇందులో భాగంగా.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచీ అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ సాగిన ఆయన రాజకీయ ప్రయాణం మొత్తం ఆ వీడియోలో ఉందని తెలిపారు. ఆ వీడియోని చూస్తే.. ఒంగోలు నియోజకవర్గాన్ని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎంత అభివృద్ధి చేశారో అర్ధమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అంతా ఆ వీడియోని చూసి, అమూల్యమైన ఓటును బాలినేని శ్రీనివాస రెడ్డికి వేసి గెలిపించాలని దిల్ రాజు కోరారు!