Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... అమెరికాలో అర్ధరాత్రి కుప్పకూలిన బ్రిడ్జ్ వీడియో వైరల్!

అవును... అమెరికాలోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది! ఈ ఘటన నగరంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది

By:  Tupaki Desk   |   26 March 2024 9:33 AM GMT
బిగ్ బ్రేకింగ్... అమెరికాలో అర్ధరాత్రి కుప్పకూలిన బ్రిడ్జ్ వీడియో వైరల్!
X

అమెరికాలో అర్ధరాత్రి ఘోర ప్రమాధం జరిగింది. ఇందులో భాగంగా మేరీల్యాండ్ లోని బాల్టీమోర్ లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఈ బ్రిడ్జి కిందనుంచి ప్రయాణిస్తున్న ఒక భారీ నౌక ఢీకొట్టడంతో ఈ ప్రమాధం జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ ప్రమాదం తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నారు.

అవును... అమెరికాలోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది! ఈ ఘటన నగరంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ బ్రిడ్జ్ కూలిన సమయంలో సుమారు 7 వాహనాలు బ్రిడ్జ్ లో పడినట్లు బాల్టీమోర్ సిటీ ఫైర్ శాఖ అధికారులు చెబుతున్నారని తెలుస్తోంది. ఈ బ్రిడ్జి కుప్పకూలుతున్న సమయంలో తీసిన పలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

వాస్తవానికి బాల్టీమోర్ లోని ప్రయాణికులకు ఇది అత్యంత కీలకమైన బ్రిడ్. ఇదే సమయంలో ఈ బ్రిడ్జ్ కింద నుంచి భారీ షిప్స్ రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో ఒక భారీ కార్గో షిప్ కూడా ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్న సమయంలో పిల్లర్ ను ఢీకొట్టింది! దీంతో భారీ అగ్నిప్రమాదం సంభవించడం, క్షణాల్లో బ్రిడ్జ్ కుప్పకూలి నీటిలో పడిపోవడం జరిగిపోయింది!

దీంతో... బ్రిడ్జ్ కు కనెక్టివిటీ ఉన్న అన్ని లైన్లనూ మూసివేసినట్లు మేరీ ల్యాండ్ ట్రాన్స్ పోర్టేషన్ అధికారులు పేర్కొన్నరు! ఈ సమయంలో ట్రాఫిక్ ను పూర్తిగా మళ్లించారు. ఈ ప్రాంత రవాణా నెట్ వర్క్ లో అత్యంత కీలకమైన అనుసంధానం అయిన ఈ వంతెన కూలిపోవడంతో ప్రయాణికులకు, అక్కడ జరిగే వ్యాపారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడతాయని భావిస్తున్నారు.!