Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఆన్ లైన్ ప్రకటనల్లో బీజేపీ టాప్... డిటైల్స్ ఇవే!

దీంతో.. ఆన్ లైన్ వేదికగా బీజేపీ ప్రకటనల వర్షం కురిపిస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   29 March 2024 4:33 AM GMT
తెలంగాణలో ఆన్  లైన్  ప్రకటనల్లో  బీజేపీ టాప్... డిటైల్స్  ఇవే!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఇదే సమయంలో ఆన్ లైన్ వేదికగానూ భారీఎత్తున ప్రకటనలు ఇస్తోంది. ఈ సమయంలో భారతీయ జనతాపార్టీ.. గూగుల్, యూట్యూబ్ లలో చేసిన ప్రకటనల ఖర్చూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలూ చేసిన ఖర్చులో సుమారు 40 శాతం అని గూగుల్ విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. దీంతో.. ఆన్ లైన్ వేదికగా బీజేపీ ప్రకటనల వర్షం కురిపిస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... తెలంగాణ ప్రాంతంలో యూట్యూబ్ లో ఏ వీడియో చూసినా.. అది పూర్తయ్యే లోపు కచ్చితంగా బీజేపీ ప్రకటన కనిపిస్తుందనే కామెంట్లు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లకు బలం చేకూరుస్తూ... తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 - 2024 నుంచి 27 మార్చి 2024 మధ్య రాజకీయ పార్టీలు గూగుల్, యూట్యూబ్ లలో యాడ్స్ కోసం చేసిన ఖర్చు రూ.30.2 కోట్లు కాగా.. బీజేపీ చేసిన ఖర్చు రూ.12 కోట్లు అని గూగుల్ తాజా నివేదికలో వెల్లడించింది!

ఈ సమయంలో... గూగుల్, యూట్యూబ్ లలో కలిసి మొత్తం 15,690 పొలిటికల్ యాడ్స్ ప్రదర్శించబడ్డాయని.. ఇందులో 80.9 శాతం వీడియో ప్రకటనలు కాగా.. వాటికోసం అయిన ఖర్చు రూ.24.4 కోట్లని తెలిపింది. అదేవిధంగా... 19.1 శాతంగా ఉన ఫోటో యాడ్స్ కి అయిన ఖర్చు రూ.5.7 కోట్లని పేర్కొంది. ఇలా మొత్తం ప్రకటనల్లో బీజేపీ మాత్రమే 11, 613 ప్రకటనలు కలిగి ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో 62.7 శాతం వీడియో యాడ్స్ కాగా.. 37.3 శాతం ఫోటో యాడ్స్ అని వివరించింది.

మరోపక్క... సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్స్ – డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ... ప్రకటనల ఖర్చు రూ. 8.41 కోట్లు కాగా.. ఈ జాబితాలో రెండో ప్లేస్ లో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రచార అవసరాలను నిర్వహిస్తుంది. ఇక ఈ జాబితాలో మూడో ప్లేస్ లో ఉన్న ఇండియా ఫాచ్ కన్సల్టింగ్ రూ.3.19 కోట్ల విలువైన ప్రకటనలను ప్రసారం చేసింది. అనంతరం నాలుగో స్థానంలో.. టీడీపీ రాజకీయ ప్రకటనల కోసం రూ.2.07 కోట్లు వెచ్చింఛినట్లు పేర్కొంది!

ఇక ఈ ప్రకటనల జాబితాలో వివిధ భాషల్లో ప్రభుత్వ పథకాలు అందింఛిన రాష్ట్రాల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జాబితాలో రూ.15.8 కోట్ల ఖర్చుతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా.. రూ.11.1 కోట్లతో మహారాష్ట్ర, బీహార్ లు రెండో ప్లేస్ లో ఉన్నాయి.