Begin typing your search above and press return to search.

బీజేపీ తీరు మీద బాబు అసహనం...!?

ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది పూర్తిగా ఏపీలో అన్నీ సాఫీగా సాగాలని తాము కోరుకున్నట్లుగా ఏపీలో ఎన్నికల రాజకీయం సాగాలన్నది టీడీపీ ఆలోచన అని చెబుతారు

By:  Tupaki Desk   |   23 April 2024 6:09 PM GMT
బీజేపీ తీరు మీద బాబు అసహనం...!?
X

ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది పూర్తిగా ఏపీలో అన్నీ సాఫీగా సాగాలని తాము కోరుకున్నట్లుగా ఏపీలో ఎన్నికల రాజకీయం సాగాలన్నది టీడీపీ ఆలోచన అని చెబుతారు. ముఖ్యంగా ఎలక్షనీరింగ్ విషయంలో బీజేపీ సాయం ఉంటుందని ఏపీలో అధికార వైసీపీని కట్టడి చేయడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం ఉంటుందని తెలుగుదేశం తలపోసింది.

కానీ దానికి భిన్నంగా కూటమికి బీజేపీ పెద్దల నుంచి సాయం అందడం లేదు అని టీడీపీ అధినాయకత్వం అసహనం వ్యక్తం చేస్తోంది అని ప్రచారం సాగుతోంది. ఏపీలో ఎన్నికల ప్రచారానికి కచ్చితంగా 17 రోజులు మాత్రమే ఉంది.

అంటే గట్టిగా సమయం కూడా లేదు. ఈ నేపధ్యంలో బీజేపీ అనుకున్న విధంగా సాయం చేయకపోతే ఎలా అన్న మధనం అయితే పట్టుకుందిట. ఏపీలో డీజీపీని అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయమని ఇప్పటికే కోరినట్లుగా తెలుస్తోంది.

వారిద్దరూ వైసీపీకి సహకరిస్తున్నారు అన్న అనుమానాలు టీడీపీకి ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక పెన్షన్ విషయంలో ఏప్రిల్ నెలలో ఎంత రచ్చ సాగిందో అందరికీ తెలుసు. పెన్షన్లు సకాలంలో పంపిణీ చేయకపోవడం వల్ల తెలుగుదేశానికి రాజకీయంగా ఇబ్బంది వచ్చింది. ఇపుడు చూస్తే మే నెల వచ్చేస్తోంది.

ఈ నెలలో అయినా సాఫీగా వృద్ధులకు ఇంటికి వెళ్ళి పెన్షన్ అందేలా చూడాలని కోరుతున్నారు. అది కూడా ఒకటవ తేదీకే పడితేనే వారికి టీడీపీ మీద కోపం పోతుంది అని అంటున్నారు. ఇక మే లోనే ఎన్నికలు ఉన్నాయి. మే నెలలో పెన్షన్లలో మరోసారి రచ్చ కనుక జరిగితే మాత్రం కచ్చితంగా ఆ ప్రభావం కూటమి విజయావకాశాల మీద పడుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే వాలంటీర్లను తప్పించేశారు అన్న కోపం అయితే ఉంది అని భావిస్తున్నారు ఇక ఏపీలో ఎలక్షనీరింగ్ చేసుకోవడానికి వీలు అయిన నేపధ్యం ఉండాలని టీడీపీ కోరుకుంటోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ నెలాఖరులోగా డీజీపీ సీఎస్ లను బదిలీ చేయాలని కోరుతున్నారు. లేకపోతే పుణ్యా కాలం పూర్తి అయినట్లే అని కూడా భావిస్తున్నారు.

మరో వైపు చూస్తే ఏపీకి నరేంద్ర మోడీ అమిత్ షా ఎపుడు వస్తారో తెలియడం లేదు. కూటమి ప్రచారం అయితే ఊపందుకోవడంలేదు. ఎందుకంటే ఎంతసేపూ పవన్ చంద్రబాబు చెబుతున్నా ఆ మీటింగులు కిక్కు ఇవ్వలేకపోతున్నాయి. కేంద్ర పెద్దలు వచ్చి జగన్ మీద గట్టిగా విరుచుకుపడితే అపుడు మొత్తం సీన్ మారుతుందని భావిస్తున్నారు.

గత నెలలో చిలకలూరిపేట కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ జగన్ మీద పెద్దగా విమర్శలు చేయలేదు. కూటమిలో ఆ బాధ ఉంది. ఇపుడు అలా కాకుండా జగన్ మీద దూకుడుగా బీజేపీ పెద్దలు విమర్శలు చేయాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా చూస్తే కనుక బీజేపీ జాతీయ పెద్దల తీరు పట్ల చంద్రబాబు కొంత అసహనంగానే ఉంటున్నారు అని అంటున్నారు. ఆరు ఎంపీ సీట్లు పది దాకా అసెంబ్లీ సీట్లు ఇచ్చి బీజేపీ పట్ల ఏపీలో కోపంగా జనాలు ఉన్నారని తెలిసి కూడా పొత్తు పెట్టుకుంటే తగిన ఫలితం దక్కడం లేదని అంటున్నారు.