Begin typing your search above and press return to search.

చంద్రబాబు సామాజిక న్యాయంపై చిరంజీవి... ఓల్డ్ వీడియో వైరల్!

ఇదే సమయంలో ఆయన పాత వీడియో ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది.. ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది

By:  Tupaki Desk   |   21 April 2024 9:30 AM GMT
చంద్రబాబు సామాజిక న్యాయంపై చిరంజీవి... ఓల్డ్ వీడియో వైరల్!
X

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి నిలవాలని బాబు & కో భావిస్తుండగా.. మరోసారి గెలుపు తమదే అని వైసీపీ ధీమా చెబుతుంది. ఈ సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... కూటమి అభ్యర్థులను గెలిపించాలని చిరంజీవి కోరిన వీడియో వైరల్ గా మారింది. ఇదే సమయంలో ఆయన పాత వీడియో ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది.. ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది!

అవును... తాజాగా ఏపీలో కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ తో కలిసి చిరంజీవి ఒక వీడియోని విడుదల చేశారు. కేంద్రంలో ఆయనకున్న పరిచయాలతో సీఎం రమేష్ అనకాపల్లిని అభివృద్ధి చేస్తారని చెబుతూ.. తన బ్లెస్సింగ్స్ తోనే పంచకర్ల రాజకీయాల్లోకి వచ్చారని.. వీరిద్దరినీ గెలిపించాలని చిరంజీవి కోరారు! దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ సమయంలో... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండానే ఎన్డీయే అభ్యర్థుల గెలుపును చిరంజీవి కాంక్షిస్తున్నారనే కామెంట్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి! ఆ సంగతి అలా ఉంటే... గతంలో టీడీపీ - బీజేపీ కూటమిగా పోటీ చేసిన సమయంలో హిందూపురంలో ఒక ముస్లిం నాయకుడిని కాదని.. చంద్రబాబు తన బావమరిది బాలకృష్ణకు టిక్కెట్ ఇచ్చారంటూ చిరంజీవి స్పందించిన సందర్భంలోనిదిగా ఉన్న ఒక వీడియో.. ఆ వీడియోలో చిరు వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ గా మారాయి!

అందులో భాగంగా... "హిందూపూర్ లో ఒక ముస్లిం సోదరుడు ఆల్ రెడీ ఉంటే, అతన్ని కాదని, ఆ ముస్లిం సోదరుడిని కాదని, పక్కకు తీసి.. ఆ సీట్లో తన బావమరిది బాలకృష్ణకు ఇవ్వడం అనేది ఎంతవరకూ సామాజిక న్యాయం, ఎంత వరకూ ముస్లిం సోదరులకు న్యాయం" అని చిరంజీవి ప్రశ్నించారు. నాడు ముస్లింలకు చంద్రబాబు చేసిన అన్యాయంగా దీన్ని చిరంజీవి అభివర్ణించారు.

ఇదే సమయంలో... మోడీతో చేతులు కలిపిన తర్వాత ముస్లిం మైనారిటీలు తన పక్కనలేరని నిర్ధారించేసుకున్న చంద్రబాబు... వాళ్లను పక్కకునెట్టడం అనేది నిజంగా అన్యాయం, ముస్లింలకు చేసే అన్యాయం అని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మరోసారి మోడీ - చంద్రబాబు కలిసే పోటీ చేస్తుండటం, మరోసారి హిందూపూర్ లో బాలకృష్ణే పోటీ చేస్తుండటంతో చిరు వ్యాఖ్యలు తాజాగా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి!!