Begin typing your search above and press return to search.

విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారి... తెరపైకి కొకైన్ వ్యాక్సిన్!

2021లో సుమారు 22 మిలియన్ల మంది డ్రగ్స్ తీసుకున్నారంటూ ఐక్యరాజ్య సమితి నిపుణులు అంచనా వేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

By:  Tupaki Desk   |   29 March 2024 11:35 AM GMT
విస్తరిస్తున్న డ్రగ్స్  మహమ్మారి... తెరపైకి కొకైన్  వ్యాక్సిన్!
X

ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ అనేది పెనుభూతంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న యువత డ్రగ్స్ బారిన పడి జీవితం నాశనం చేసుకుంటున్నరని అంటున్నారు. 2021లో సుమారు 22 మిలియన్ల మంది డ్రగ్స్ తీసుకున్నారంటూ ఐక్యరాజ్య సమితి నిపుణులు అంచనా వేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా కొకైన్ వ్యాక్సిన్ తెరపైకి వచ్చింది!

అవును... డ్రగ్స్ వాడకంలో వినియోగదారులు పెరగకుండా ఉండటానికి, బానిసత్వం తగ్గడానికి, వ్యసనాన్ని నిరోధించడానికి బ్రెజిల్ లోని పరిశోధకులు కొకైన్ వ్యాక్సిన్ ను అభివృద్ది చెస్తున్నారు! ఈ సమయంలో... ఈ వ్యాక్సిన్ ను చికిత్సతో పాటే తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఐరోపాలో గంజాయి వాడకం తర్వాత కొకైన్ రెండవ అత్యంత సాధారణ వీధి డ్రగ్స్ గా మారిందని చెబుతున్నారు.

ఈ క్రమంలో... బ్రెజిల్ లోని పరిశోధకులు కొకైన్ వ్యసనంతో పోరాడుతున్న వ్యక్తులకు వ్యాక్సిన్ తో మద్దతివ్వాలని ఆశిస్తున్నారని.. ఫలితంగా వినియోగదారుల డ్రగ్స్ వాడకం, అధిక మోతాదుకు వెల్లకుండా ఆపివేస్తుందని, వ్యసన ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంటున్నారు. వాస్తవానికి కొకైన్ ను తీసుకున్నప్పుడు.. ఆ పదార్ధం రక్తం ద్వారా మెదడుకు త్వరగా చేరుతుంది.

అనంతరం ఔషదం డోపమైన్ తో సహా వివిధ మెసెంజర్ పదార్థాలను విడుదల చేయడానికి శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఈ సమయంలో శరీరం హైపరేక్టివ్, చికాకు పొందుతుంది. ఇదే సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు రక్తపోటూ పెరుగుతుంది. ఇదే సమయంలో ఆకలి, దాహం అసంబద్ధంగా పెరిగిపోతాయి. ఈ సమయంలో మూర్చ రావడం, గుండె ఆగిపోవడానికి దారితీయొచ్చు! ఈ మత్తు గరిష్ట స్థాయి ఐదు నిమిషాల నుంచి అరగంట మధ్య ఉంటుందని చెబుతుంటారు!

ఈ సమయంలో అన్ని ట్రాఫిక్ లైట్లూ ఆకుపచ్చగానే కనిపిస్తుంటాయని బెర్లిన్ డ్రగ్ థెరపీ అసోసియేషన్ లోని థెరపిస్ట్ హాన్స్ పీటర్ చెబుతూ... ఈ సమయంలో మెదడు మరింత కోరుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా బ్రెజిల్ పరైశోధకులు తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఎలా ఉపయోగపడోచ్చనేది నిపుణులు చెబుతున్నారు.

ఇందులో భాగంగా... బ్రెజిల్ లోని పరిశోధకులు తమ వ్యాక్సిన్ డ్రగ్స్ ద్వారా వెలువడిన పదార్ధం రక్తం గుండా మెదడులోకి వెల్లడాన్ని మరింత కష్టతరం చేస్తుందని చెబుతున్నారు. ఇలా కొకైన్ మెదడుకు చేరి దానిని ఉత్తేజపరచలేకపోతే... వినియోగదారుడు అధిక స్థాయికి చేరుకోలేడని.. ఫలితంగా మెదడు ప్రతిచర్యలు ఆగిపోతాయని చెబుతున్నారు.

మరోపక్క యూఎస్ లోని పరిశోధకులు కూడా కొకైన్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మనుషులపై క్లీనికల్ ట్రయల్స్ పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా నిశ్చితంగా చెప్పలేరని అంటున్నారు.