Begin typing your search above and press return to search.

ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణం ఆ 12 దేశాలే?

ప్లాస్టిక్ ను పెంచే దేశాల్లో అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్థాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండినేషియా, టర్కీ, వియత్నాం దేశాలున్నాయి.

By:  Tupaki Desk   |   13 April 2024 4:13 AM GMT
ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణం ఆ 12 దేశాలే?
X

ప్రపంచంలో ప్లాస్టిక్ భూతం జడలు విప్పుతోంది. దీంతో పర్యావరణానికి చేటు కలుగుతోంది. కుప్పలుగా పేరుకుపోయే చెత్త వల్ల అనర్థాలు ఏర్పడుతున్నాయి. ఓ పశువు శరీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు కిలోల లెక్కన బయటపడ్డాయంటే జంతువులు కూడా ప్లాస్టిక్ ను తింటూ తమ ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్లాస్టిక్ వాడకం పెరుగుతోంది. దీని వల్ల ప్రపంచమే పలు సమస్యలు ఎదుర్కొంటోంది.

ప్లాస్టిక్ కారకాలను పెంచే దేశాలు..

ప్లాస్టిక్ ను పెంచే దేశాల్లో అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్థాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండినేషియా, టర్కీ, వియత్నాం దేశాలున్నాయి. ఈ 12 దేశాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా మారుతున్నాయి. దీంతో పర్యావరణానికి హాని జరుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో శుద్ధి చేయని ప్లాస్టిక్ వ్యర్థాలు 8 కిలోలు మాత్రమే. ఇది అమెరికా వ్యర్థాల్లో మూడోవంతు, చైనా వ్యర్థాల్లో ఐదో వంతు కన్నా తక్కువే.

భారత్ లో శుద్ధి చేయని వ్యర్థాలు 74 లక్షలు

భారత్ లో శుద్ధి చేయకుండా వదిలేసే ప్లాస్టిక్ వ్యర్థాలు 2024లో 74 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా. ప్రపంచంలో ఈ ఏడాది 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడగా 7 కోట్ల టన్నుల వ్యర్థాలు శుద్ధి చేయకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. దీని వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.

జాగ్రత్తలు తీసుకోవడం లేదు

ప్లాస్టిక్ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా మొత్తుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. దీని పర్యవసానం పలు మార్పులు మనకు కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, భూకంపాలు లాంటివి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయి. అయినా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫలితంగా మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయి.

ఒట్టావాలో..

కెనడాలోని ఒట్టావాల ఐక్యరాజ్య సమితి అనుబంధ కమిటీ త్వరలో సమావేశం కానుంది. ఇందులో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టాల గురించి ఫోకస్ పెట్టనున్నారు. ప్రపంచంలో ప్లాస్టిక్ భూతం వల్ల పర్యావరణం ఎలా పాడైపోతోందో వివరించి దాని నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.