Begin typing your search above and press return to search.

ఇంత పెద్ద వ్యాపారమా? ఇండియా గేమింగ్ రిపోర్టు చదివారా?

చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరి చేతుల్లో సెల్ ఫోన్ సర్వసాధారణం. ఇవాల్టి రోజున స్మార్ట్ ఫోన్ ఎంత కామనో

By:  Tupaki Desk   |   28 March 2024 4:30 AM GMT
ఇంత పెద్ద వ్యాపారమా? ఇండియా గేమింగ్ రిపోర్టు చదివారా?
X

చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరి చేతుల్లో సెల్ ఫోన్ సర్వసాధారణం. ఇవాల్టి రోజున స్మార్ట్ ఫోన్ ఎంత కామనో.. అందులో ఇంటర్నెట్ బైడిపాల్ట్ అన్నట్లు మారింది. అదే రీతిలో గేమింగ్ అప్లికేషన్లు కూడా అందరి ఫోన్ లో ఉండటం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించిన బిజినెస్ ఎంత భారీ అన్న విషయాన్ని తాజాగా విడుదలైన ఇండియా గేమింగ్ రిపోర్టు2024 చదివితే అవాక్కు అవ్వాల్సిందే. భారతీయ గేమింగ్ పరిశ్రమ వార్షికాదాయం ఐదేళ్లలో రెట్టింపు కానున్న విషయాన్ని చెప్పటమే కాదు మరిన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.

2023లో 3.1 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ 2028 నాటికి 6 బిలియన్ డాలర్ల (దగ్గర దగ్గర రూ.50వేల కోట్లు)కు చేరనుంది. ఇంటరాక్టివ్ ఎంటర్ టైన్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్.. ఆన్ లైన్ గేమింగ్ సంస్థ విన్ జో సంయుక్తంగా ఈ రిపోర్టును రూపొందించారు. తాజా రిపోర్టు ప్రకారం 2028 నాటికి ఇండియాలో పెయిడ్ యూజర్ల సంఖ్య 24 కోట్లకు చేరనుంది. 2023లో దీని సంఖ్య 14.4 కోట్లుగా ఉంది. అంటే.. రెట్టింపు కానుందన్న మాట.

భారత గేమింగ్ రంగంలో మొత్తం 1400 గేమింగ్ కంపెనీలు ఉండగా.. వాటిల్లో 500 గేమింగ్ స్టూడియోలు ఉన్నాయి. 2019 నుంచి 2023 మధ్య కాలంలో భారత్ లో గేమ్ డౌన్ లోడ్ల సంఖ్య 565 కోట్ల నుంచి 950 కోట్లకు చేరాయి. దీంతో అంతర్జాతీయంగా గేమ్ డౌన్ లోడ్ల వాటాలో భారత్ 16 శాతానికి పైగా ఉండటం విశేషం. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, అమెరికాలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం ప్రతి ఐదుగురు గేమర్లలో ఒక మహిళ మాత్రమే ఉండగా.. ప్రస్తుతం గేమర్లలో 40 శాతం మంది మహిళలు ఉన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది.

భారత గేమిగ్ మార్కెట్ లో మొబైల్ గేమింగ్ వాటా 90 శాతంగా ఉంది. అదే అమెరికాలో 37 శాతం, చైనాలో 62 శాతం ఉండటం గమనార్హం. మొబైల్ గేమర్లలో 50 శాతం మంది 18-30 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారే. ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీలో రానున్న పదేళ్లలో మరో 2.5 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం లక్ష మంది నిపుణులు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి పొందుతున్నట్లుగా రిపోర్టు వెల్లడించింది.