Begin typing your search above and press return to search.

అమెరికాలోని విద్యార్థుల కోసం భారతీయ తల్లిదండ్రుల ఆందోళన

మన భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లి బాగా చదువుకుని అక్కడే స్థిరపడి మంచి ఉద్యోగం చేయాలని భావిస్తున్నారు

By:  Tupaki Desk   |   26 March 2024 7:37 AM GMT
అమెరికాలోని విద్యార్థుల కోసం భారతీయ తల్లిదండ్రుల ఆందోళన
X

మన భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లి బాగా చదువుకుని అక్కడే స్థిరపడి మంచి ఉద్యోగం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాను ఎంచుకుంటున్నారు. అగ్రదేశం కావడంతో అక్కడ చదువుకుంటే మంచి ఉద్యోగం కూడా వస్తుందని అనుకుంటున్నారు. దీని కోసమే అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎంత డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు. అమెరికాలో చదువుకుని అక్కడే స్థిరపడాలని కోరుకుంటున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు.

భారతీయ విద్యార్థులు విద్య నేర్చుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనకాడటం లేదు. 2024లో భారతీయ సంతతికి చెందిన ఏడుగురు యువకులు ఆత్మహత్యలకు పాల్పడటం సంచలనం కలిగించింది. ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంకో ఇద్దరు డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయారు. ఒకరు ప్రాణాంతక దాడిలో మరణించాడు. ఇద్దరు కనిపించకుండా పోయారని నివేదికలు చెబుతున్నాయి.

భారతీయ విద్యార్థులు చదువుకునేటప్పుడు ఒత్తిడికి గురవుతున్నారు. అక్కడి వాతావరణానికి తట్టుకోలేకపోతున్నారు. భద్రతా చర్యలు తీసుకోవడం లేదు. చాలా మంది మద్యపానం బారిన పడుతున్నారు. దీని వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు వేదన చెందుతున్నారు. తమ పిల్లల భవితవ్యంపై ఆందోళన పడుతున్నారు.

అమెరికాలో స్థిరపడిన తమ పిల్లల కెరీర్ పట్ల నిరంతరం బాధపడుతున్నారు. భవిష్యత్ లో విద్యార్థుల మనుగడకు ఎలాంటి ప్రమాదం ఉండకూడదని తల్లిదండ్రులు కోరుతున్నారు. వారి మానసిక పరిస్థితిని మెరుగుపరచి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి ఆశావహ ఆలోచనలతో ముందుకెళ్లేలా మార్గదర్శనం చేయాలని సూచిస్తున్నారు.

అమెరికాలో స్థిరపడిన భారతీయ విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేయాలని మానసిక నిపుణులు సైతం చెబుతున్నారు. మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న వారిని గుర్తించి వారికి సరైన కౌన్సెలింగ్ ఇప్పించి వారి స్థితిని మార్చాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. దీని కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.