Begin typing your search above and press return to search.

స్వలింగ సంపర్క బిల్లుకు ఇరాక్ ఆమోదం... శిక్ష ఎంతంటే...?

స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని ఇరాక్ పార్లమెంటు ఆమోదం తెలిపింది.

By:  Tupaki Desk   |   28 April 2024 11:18 AM GMT
స్వలింగ సంపర్క బిల్లుకు  ఇరాక్  ఆమోదం... శిక్ష ఎంతంటే...?
X

స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని ఇరాక్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా... స్వలింగ సంపర్కాన్ని ఇరాక్ పార్లమెంట్ నేరంగా పరిగణించింది. తాజాగా ఆమోదించబడిన ఈ బిల్లు ద్వారా తయారయ్యే చట్టం ప్రకారం.. స్వలింగ సంపర్కం కలిగి ఉన్న వారికి 15 సంవత్సరాల వరకూ శిక్షను విధిస్తున్నట్లు ప్రకటించింది. మతపరమైన విలువల ఆధారంగా ఈ చట్టాన్ని ఆమోదించినత్లు చెబుతున్నారు.

అవును... స్వలింగ సంపర్కాన్ని నేరంగా గుర్తించే బిల్లును ఇరాక్ పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్ట ప్రకారం స్వలింగ సంపర్కులకు 15 ఏళ్ల వరకు శిక్ష విధించే నిబంధన ఈ బిల్లులో ఉంది. ఇదే సమయంలో... ఈ చట్ట ప్రకారం ట్రాన్స్‌ జెండర్లను కూడా ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలుకు పంపవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా... వ్యభిచారంపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఇరాక్ పార్లమెంట్ తెలిపింది!

ఈ నేపథ్యంలో... లెస్బియన్ కమ్యూనిటీ, పలు పాశ్చాత్య దేశాలు.. ఇరాక్ పార్లమెంట్ తాజాగా ఆమొదం తెలిపిన ఈ చట్టంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా... ఇరాక్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై.. అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఇలా పార్లమెంట్ తాజాగా ఆమోదం తెలిపిన ఈ చట్టం ద్వారా ఎల్జీబీటీ కమ్యూనిటీ హక్కులను ఉల్లంఘించడాన్ని ఇరాక్ కొనసాగిస్తుందని బిల్లును వ్యతిరేకిస్తున్న వర్గాలు చెబుతుండగా... దేశంలో మతపర విలువలను కాపాడటానికి ఈ కొత్త చట్టం సహాయపడుతుందని ఈ బిల్లుకు మద్దతు తెలిపే వారు భావిస్తున్నారు! మరోపక్క ఇరాక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్ సభ్యుడు సారా సంబర్ కూడా తీవ్రంగా ఖండించారు!