Begin typing your search above and press return to search.

ఏపీకి మోడీ...ఎన్నో ఆటంకాలు...!

అది కాస్తా డేట్ మారి మే లోకి వెళ్ళింది. మే 3, 4 తేదీలు ఇదే కన్ ఫర్మ్ చేసుకోమన్నారు. తీరా చూస్తే ఇపుడు ఆ డేట్స్ మళ్లీ మారి 7, 8 తేదీలకు వెళ్ళింది.

By:  Tupaki Desk   |   28 April 2024 4:02 AM GMT
ఏపీకి మోడీ...ఎన్నో ఆటంకాలు...!
X

ఏపీకి మోడీ రావాలి. ప్రచారం చేయాలి. టీడీపీ కూటమికి జోష్ కలిగించాలి అని ఆ వైపు అంతా అనుకుంటున్నారు. వైసీపీకి మోడీ మార్క్ పంచులు సెటైర్లు పడితే అంతా బ్యాలెన్స్ అవుతుందని కూటమి పెద్దలు భావిస్తున్నారు.

అయితే అంతకంతకు మోడీ ఏపీ టూర్ అలా వాయిదాల మీద వాయిదాలు పోతోంది. మొదట ఏప్రిల్ చివరి వారంలో మోడీ ఎన్నికల ప్రచారం ఏపీలో ఉంటుంది అని అన్నారు. అది కాస్తా డేట్ మారి మే లోకి వెళ్ళింది. మే 3, 4 తేదీలు ఇదే కన్ ఫర్మ్ చేసుకోమన్నారు. తీరా చూస్తే ఇపుడు ఆ డేట్స్ మళ్లీ మారి 7, 8 తేదీలకు వెళ్ళింది.

అవి కూడా మారితే కనుక ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం ఉండే చాన్సే లేదు అంటున్నారు. ఎందుకంటే మే 11 తో ఎన్నికల ప్రచారానికి పెద్ద ఫుల్ స్టాప్ పడిపోతుంది. మరి మోడీ ఎందుకు ఏపీకి రావడం లేదు ఆయన పర్యటనకు ఎందుకు అవాంతరాలు వస్తున్నాయి అన్నది కూడా చర్చ సాగుతోంది.

దేశమంతా తిరిగే మోడీకి ఏపీకి వచ్చే తీరిక లేదా అంటే అన్నీ ఉన్నాయి. మోడీ సార్ అనుకుంటే ఒకేరోజు నాలుగైదు రాష్ట్రాలలో కూడా తిరిగేయగలరు. అలా చాలా సార్లు చేశారు కూడా. కానీ ఏపీకి వచ్చేందుకు ఏమైనా మొహమాటాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది.

రాజకీయంగా చూస్తే ఉత్తర భారతం బీజేపీకి కొంత ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటోందని రెండు విడతలుగా జరిగిన పోలింగ్ శాతం సంకేతాలు ఇస్తోంది. దాంతో మిగిలిన విడతల సంగతి ఏమిటి అన్న కంగారు బీజేపీ పెద్దలలో మొదలైంది అని అంటున్నారు.

ఇక చూస్తే బీజేపీ సొంతంగా 370, ఎన్డీయేకు నాలుగు వందలు అని బిగ్ నంబర్ తో భారీ టాస్క్ తో ఎన్నికల గోదాలోకి దిగింది. చూడబోతే ఎన్డీయేకు మెజారిటీకి ఇబ్బంది అవుతుందా అన్న చర్చ నడుస్తోంది. అదే జరిగితే నమ్మదగిన మిత్రులు ఎవరు ఎన్డీయే లోపలా బయటా అన్నది కూడా బీజేపీ పెద్దలను తీవ్రంగా ఆలోచింపచేస్తోంది అంటున్నారు. ఈ రకమైన తర్జన భర్జనల మధ్యనే మోడీ సహా బీజేపీ పెద్దలు ఏపీ వైపు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు అని అంటున్నారు.

ఏపీకి వెళ్ళి జగన్ మీద తీవ్రంగా విమర్శలు చేస్తే ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటులో సీట్లు తగ్గితే సంగతేంటి అన్నది కూడా ఆలోచనగా ఉంది అంటున్నారు. అందుకే తాజాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మోడీకి ఇష్టం లేదు టీడీపీతో పొత్తు అని ఒక సంచలన కామెంట్ చేశారు.

దాంట్లో ఎంతవరకూ నిజముందో తెలియదు కానీ కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాకపోతే ఏపీలో రాజకీయం మాత్రం ఆసక్తికరం గా మారడం తధ్యమని అంటున్నారు. అందుకే మోడీ వంటి వారు కూడా ఏపీ విషయంలో ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి.