Begin typing your search above and press return to search.

నాన్ స్టాప్ 4 గంటలు .. 95 వేల లైవ్ వ్యూస్

12 ఏళ్ల తర్వాత మంగళవారం 4 గంటలపాటు అదే టీవీ9 రజనీకాంత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   24 April 2024 4:36 AM GMT
నాన్ స్టాప్ 4 గంటలు .. 95 వేల లైవ్ వ్యూస్
X

రాజకీయాలు, ఇరిగేషన్‌, విద్యుత్తు, ఆర్థిక, తాగునీరు, ప్రస్తుత కాంగ్రెస్ పాలన, దేశ రాజకీయాలు, భవిష్యత్ పరిణామాలు. భిన్నరంగాలపై ఒకే ఒక వ్యక్తి విశ్లేషణ. టీవీ9 ఛానల్ వేదికగా కేసీఆర్ 4 గంటల ఏకధాటి ఇంటర్వ్యూ తెలుగు మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నది.

2012లో నాన్‌స్టాప్‌గా టీవీ9 రజనీకాంత్‌కే 3.30 గంటలపాటు కేసీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. 12 ఏళ్ల తర్వాత మంగళవారం 4 గంటలపాటు అదే టీవీ9 రజనీకాంత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రత్యేక కార్యక్రమాలకు‌ మినహా వ్యక్తిగత ఇంటర్వ్యూలకు ఈ స్థాయిలో భారీ లైవ్‌ వ్యూస్‌ రావడం మీడియా చరిత్రలో అరుదు. తెలంగాణలో పల్లెలు, పట్టణాల వరకు జనం అంతా టీవీల వైపు ఎగబడ్డారు. ఐపీఎల్ మ్యాచ్ కన్నా కేసీఆర్ ఇంటర్వ్యూ చూడడానికే ఆసక్తి చూపారు.

పలు చోట్ల బీఆర్‌ఎస్‌ నేతలు తమ నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రజలకు కేసీఆర్ ఇంటర్వ్యూ చూసేలా ఏర్పాటు చేశారు.