Begin typing your search above and press return to search.

బుర్రిపాలెం టు అమెరికా... డాక్టర్ పెమ్మసాని సక్సెస్ జర్నీ ఇదే!

సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా మిగిలిన దశల పోలింగ్ కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నడుస్తోంది

By:  Tupaki Desk   |   24 April 2024 1:30 PM GMT
బుర్రిపాలెం టు అమెరికా... డాక్టర్ పెమ్మసాని సక్సెస్ జర్నీ ఇదే!
X

సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా మిగిలిన దశల పోలింగ్ కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నడుస్తోంది. ఇందులో భాగంగా... నాలుగో విడతలో భాగంగా జరగనున్న ఏపీలో ఈ సందడి బలంగా నడుస్తోంది! ఈనెల 25తో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో... ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఈ సమయంలో... అందరి దృష్టి అభ్యర్థుల అఫిడవిట్లపై నెలకొంది!

ఇందులో భాగంగా రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతులు ఎవరు.. ఎవరిపై ఎక్కువ కేసులు ఉన్నాయి.. ఎవరు ఎక్కువ విద్యావంతులు.. ఏ పార్టీలో ఎక్కువ మంది కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు.. మరేపార్టీలో సామాన్యులకు టిక్కెట్లు దక్కాయి మొదలైన విషయాలపై చర్చ నడుస్తుంది. ఈ సమయంలో అత్యంత ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పై అందరి దృష్టీ నిలిచింది.

అవును... ఏపీలోని గుంటూరు టీడీపీ లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.. సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ.5,705 కోట్లుగా ప్రకటించారు. దీంతో... ఆయన గురించిన చర్చ బలంగా మొదలైంది. ఆయన ఎవరు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. ఏమి చేసి ఈ స్థాయికి ఎదిగారు అనే సెర్చ్ మొదలైంది. ఈ సమయంలో... ఈ క్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు పెమ్మసాని చంద్రశేఖర్. చిన్నప్పటి నుంచీ చదువులో ముందుండే పెమ్మసాని... 1991 లో పదోతరగతి, 1993లో ఇంటర్ పూర్తిచేస్తారు. అనంతరం డాక్టర్ కావాలనే లక్ష్యంతో 1993-94లో ఎంబీబీఎస్‌ ఎంట్రన్స్‌ లో 27వ ర్యాంకు సాధించారు. ఫలితంగా.. హైదరాబాద్‌ ఉస్మానియాలో సీటు సంపాదించారు.

ఇలా ఉస్మానియాలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్... పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లారు. అక్కడ... పీజీ పూర్తి చేసిన అనంతరం.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా ఐదేళ్లపాటు కొనసాగారు. ఇదే సమయంలో... మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు.

ఇందులో భాగంగా... తాను సొంతంగా తయారు చేసిన నోట్స్‌ ను తక్కువ ధరకు ఆన్ లైన్‌ లో అందించేవారు. దీంతో... ఆయన ప్రయత్నానికి మంచి ఆదరణ లభించింది. ఆయన రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో... విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ ఆన్‌ లైన్‌ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించి.. ఫార్మసీ, నర్సింగ్‌, లా, ఫైనాన్స్, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు.

అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక యువ వ్యాపారవేత్తగా ఎదిగారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ క్రమంలో... నేటికీ అక్కడ వైద్య పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు యు వరల్డ్ ద్వారా ఆయన శిక్షణ అందిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా ఆయన కోట్ల రూపాయిలను సంపాదించగలిగినట్లు చెబుతున్నారు! అనంతరం... చంద్రశేఖర్ అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉంటూ.. "పెమ్మసాని ఫౌండేషన్‌" ను స్థాపించి ఎన్నారైలకు ఉచిత వైద్య సేవలు అందించారు.

ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన... పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చడానికి కృషి చేశారు. ఇందులో భాగంగా... సొంత డబ్బులతో బోర్‌ వెల్స్‌, ఆర్వో ప్లాంట్స్‌ ఏర్పాటు చేశారు. బెస్ట్ బెరీ స్కూల్‌ ను ప్రారంభించారు. పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి.. పేద ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయాలపై ఆసక్తితో టీడీపీలో చేరి, గుంటూరు లోక్‌ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.