Begin typing your search above and press return to search.

పెమ్మసానికి వైఎస్ జగన్ ట్రిపుల్ ఆఫర్ ఇచ్చారా?

దీంతో... ఇప్పుడు యూట్యూబ్ నిండా ఆయన ఇంటర్వ్యూలు దర్శనమిస్తున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 April 2024 7:44 AM GMT
పెమ్మసానికి వైఎస్  జగన్  ట్రిపుల్  ఆఫర్  ఇచ్చారా?
X

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సుమారు రూ.5,700 కోట్లకు పైగా ఆస్తులను తన అఫిడవిట్ లో ప్రకటించిన ఆయన ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయారు. దీంతో... ఇప్పుడు యూట్యూబ్ నిండా ఆయన ఇంటర్వ్యూలు దర్శనమిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ. 5700 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమలో తాజాగా ఈ రిచ్చెస్ట్ ఎంపీ అభ్యర్థి.. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జరిగినట్లు చెబుతున్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

ఇందులో భాగంగా... తాను 2019 నుంచి రాజకీయాల్లోకి ఉన్నట్లు చెప్పిన పెమ్మసాని.. ఆ సమయంలో తనకు చాలా లాభదాయకమైన ఆఫర్లు కూడా వచ్చాయని వెల్లడించారు! ఈ క్రమలోనే 2019 ఎన్నికల సమయంలో... వైఎస్సార్ కాంగ్రెస్‌ నుంచి తనకు ఏకంగా మూడు ఆఫర్లు వచ్చాయని చెప్పుకొచ్చారు!

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఈ విషయం చాలా మందికి తెలియదు కానీ వైసీపీ తనకు 2019లోనే ట్రిపుల్ ఆఫర్ ఇచ్చిందని అన్నారు! అందులో భాగంగా... గుంటూరు ఎంపీ టికెట్‌, నర్సరావుపేట ఎంపీ టిక్కెట్‌ లను ఆఫర్ చేసినట్లు తెలిపారు. ఇదే క్రమంలో... ప్రత్యక్ష ఎన్నికల్లో పోరు వద్దనుకుంటే... రాజ్యసభ సీటు కూడా తీసుకోవచ్చని ఆఫర్ చేసినట్లు వెల్లడించారు! ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చని తనకు చెప్పినట్లు తెలిపారు!

అయితే... ఆ సమయంలో... వైసీపీ అధినేత నుండి వచ్చిన ఈ ఆఫర్‌ లను తిరస్కరించినట్లు చెప్పిన పెమ్మసాని.. చంద్రబాబు రాజకీయ నాయకుడిగా.. మరింత స్థిరంగా, తెలివిగా ఉన్నారని తాను ఎప్పుడూ భావించినట్లు చెబుతూ.. అందువల్లే తాను టీడీపీ చేరాలని భావించినట్లు తెలిపారు! అనంతరం ఇలా గుంటూరు లోక్ సభ అభ్యర్థిగా అవకాశం వచ్చిందని అన్నారు!