Begin typing your search above and press return to search.

చిరంజీవిని ముందు పెట్టి... వైసీపీకి ఇరకాటమే ?

కానీ చిరంజీవి అవసరం రాజకీయాలు చేద్దామని అనుకుంటున్న వారికి ఉంది.

By:  Tupaki Desk   |   24 April 2024 3:50 AM GMT
చిరంజీవిని ముందు పెట్టి... వైసీపీకి ఇరకాటమే ?
X

మెగాస్టార్ చిరంజీవి విషయం చూస్తే ఆయన అందరి వాడుగా ఉంటారు. ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. దూకుడుగా ఉండరు. అలాంటి చిరంజీవి ఇపుడు ఏపీ రాజకీయాల్లోకి వచ్చేశారు. ఆయన వచ్చారా తెచ్చారా అంటే రెండవదే కరెక్ట్ అని అనుకోవాల్సి ఉంది. చిరంజీవికి రాజకీయాలు అవసరం లేదు. కానీ చిరంజీవి అవసరం రాజకీయాలు చేద్దామని అనుకుంటున్న వారికి ఉంది.

ఇదిలా ఉంటే చిరంజీవి కూటమికి మద్దతు తెలిపారు.దాంతో వైసీపీ నుంచి కొంత మేర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారు. దానికి మెగాభిమానులు కూడా కౌంటర్ వేస్తున్నారు. నిజానికి మెగాభిమానులు కొంత వరకూ న్యూట్రల్ గా ఉంటున్నారు.

చిరంజీవి విషయంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు గట్టిగా తగులుకోవడంతో వారు యాంటీ సైడ్ తీసుకుంటున్నారు. మరో వైపు చూస్తే సజ్జల చిరంజీవి కూటమికి మద్దతు ఇవ్వడం పట్ల తొలి రోజు కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన ఏమీ పేరు పెట్టి అనలేదు కానీ ఒక వైపు జగన్ ఉంటే రెండవ వైపు అంతా కలుస్తున్నారు అని అన్నారు. అందులో సింహం గా జగన్ వస్తే తోడేళ్ళు హైనాలు ముళ్ళ పందులు కలిశాయని ఆయన కామెంట్స్ చేశారు.

ఇది ఎపుడూ అంటున్నదే. ఆయన చిరంజీవిని ఏమీ అనకపోయినా నర్సాపురం సభలో పవన్ అయితే చిరంజీవి జోలికి వస్తే ఊరుకునేది లేదు అని సజ్జలకు వార్నింగ్ ఇచ్చారు. ఆ తరువాత కూడా సజ్జల చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తమకు అభ్యంతరం ఏమి ఉంటుంది. స్వాగతం అని మాత్రమే చెప్పారు.

ఇపుడు నామినేషన్ వేసి వచ్చిన తరువాత ఉప్పాడ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చిరంజీవి వంటి వారు మహనీయులు వారి మీదనే విమర్శలు చేస్తోంది వైసీపీ అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మెగాస్టార్ వంటి వారి మీద అనవసరంగా జోక్యం చేసుకోవద్దు అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి లాంటి వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఘాటుగా హెచ్చరించారు.

అంతే కాదు సజ్జలకు చెబుతున్నాను అంటూ మీ ఆధిపత్య ధోరణి మంచిది కాదు చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కూడా అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే వైసీపీ వారు ఏమీ చిరంజీవిని అనలేదు. కానీ ఆయనను ముందు పెట్టి జనసేన వైసీపీని కార్నర్ చేయడానికి చూస్తోందని అంటున్నారు. చిరంజీవి విషయంలో ఎవరైనా మాట్లాడడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.

ఆయన పట్ల తమకు గౌరవం ఉందనే వైసీపీ నేతల్తో సహా అంతా అంటారు. కానీ పవన్ మాత్రం సజ్జలను టార్గెట్ చేస్తూ చిరంజీవి ప్రస్తావనను తెస్తున్నారు. మరి దీని వెనక రాజకీయం వైసీపీకి అర్ధం అయింది కాబట్టే వారు ఫుల్ సైలెంట్ అయ్యారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరి ముందు ముందు చిరంజీవి ప్రచారానికి వస్తే ఏ విధంగా ఏపీ రాజకీయ పరిణామాలు మారుతాయో చూడాల్సి ఉంది అని అంటున్నారు.