Begin typing your search above and press return to search.

ఈ రెండు కార్లలో భద్రత డొల్ల.. షాకిచ్చిన రేటింగ్ సంస్థ!

ఇంతకూ ఆ రెండు కార్లు ఏవంటే.. ఒకటి మహీంద్రా సంస్థకు చెందిన బొలెరో నియో.. మరొకటి హోండాకు చెందిన అమేజ్ కారుగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   24 April 2024 4:28 AM GMT
ఈ రెండు కార్లలో భద్రత డొల్ల.. షాకిచ్చిన రేటింగ్ సంస్థ!
X

రెండు ప్రముఖ కంపెనీలకు చెందిన పేరున్న బ్రాండ్లుగా మార్కెట్ లో చలామణి అయ్యే రెండు కార్లకు సంబంధించి షాకింగ్ అంశాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇంతకూ ఆ రెండు కార్లు ఏవంటే.. ఒకటి మహీంద్రా సంస్థకు చెందిన బొలెరో నియో.. మరొకటి హోండా కి కు చెందిన అమేజ్ కారుగా చెప్పాలి. ఈ రెండు కార్లలో భద్రత డొల్లగా బ్రిటన్ కు చెందిన వాహన భద్రత సంస్థ ఒకటి తాజా రిపోర్టులో పేర్కొంది.

బ్రిటన్ కు చెందిన గ్లోబల్ ఎన్ క్యాప్ సంస్థ... ఈ రెండు సంస్థలకు భద్రత లోపాలు ఎక్కువగా ఉన్నాయంటూ వాటికి అతి తక్కువ రేటింగ్ కేటాయించింది. అంతేకాదు.. పెద్దలు.. పిల్లల భద్రత పరంగా బొలెరో నియోకు కేవలం ఒక స్టార్ రేటింగ్ లభించింది. అమేజ్ లో పెద్దల భద్రత పరంగా 2 స్టార్ రేటింగ్ ఇవ్వగా.. సేఫ్టీలో సున్నా రేటింగ్ ఇవ్వటం గమనార్హం. కార్ల భద్రతకు సంబంధించి.. వివిధ విభాగాల వారీగావాటి భద్రతను సాంకేతికంగా లెక్కిస్తారు.

దీన్ని స్టార్ రేటింగ్ ఇవ్వటం ద్వారా.. అందరికి సులువుగా అర్థమయ్యేలా చేస్తారు. 5 స్టార్ రేటింగ్ అంటే అత్యుత్తమంగా పేర్కొనచ్చు. అదే సమయంలో 0(సున్నా) రేటింగ్ ఇస్తే అధ్వానమని అర్థం. కియాకు చెందిన కారెన్స్ కు సంబంధించిన భద్రతా రేటింగ్ ను తాజాగా వెల్లడించారు. ఈ కారుకు పెద్దల భద్రతకు 3 స్టార్ రేటింగ్ ఇవ్వగా.. పిల్లల సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ ఇవ్వటం గమనార్హం.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మహీంద్రాకు చెందిన బొలెరో భద్రత ఏమీ లేదన్న బ్రిటన్ సంస్థ.. మహీంద్రా కంపెనీకి చెందిన ఇతర కార్లు థార్.. ఎక్స్ యూవీ 700, ఎక్స్ యూవీ 300, స్కార్పియో ఎన్ మోడళ్లకు మాత్రం అత్యంత భద్రతకు ప్రామాణికంగా చెప్పే 4.. 5 స్టార్ రేటింగ్ లభించటం విశేషం. మరి.. బొలెరో నియో విషయంలో ఆ కంపెనీ ఫోకస్ పెట్టి.. లోపాల్ని సరి చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.