Begin typing your search above and press return to search.

మోడీకి దిమ్మ‌తిరిగేలా త‌మిళ‌నాడు రైతుల షాక్‌.. పుర్రెలు, ఎముక‌ల‌తో నిర‌స‌న‌!

త‌మిళ‌నాడులో గత ఏడాది కాలంలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డిన రైతుల పుర్రెలు, ఎముక‌ల‌తో వారు ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

By:  Tupaki Desk   |   24 April 2024 10:13 AM GMT
మోడీకి దిమ్మ‌తిరిగేలా త‌మిళ‌నాడు రైతుల  షాక్‌.. పుర్రెలు, ఎముక‌ల‌తో నిర‌స‌న‌!
X

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ ఢిల్లీలో భారీ షాక్ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక నిర స‌న‌లు జ‌రిగాయి. ఈ దేశంలో నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు.. అణ‌చివేత‌లు కొత్త‌కాదు. ఏదో ఒక స‌మ‌స్య‌పై నిరంత‌రంగా.. దేశంలో ఉద్య‌మాలు సాగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా త‌మిళ‌నాడు రైతులు.. అన్నింటికంటే భిన్నంగా దేశంలో తొలిసారి.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డిన రైతుల పుర్రెలు, ఎముల‌తో ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న తెలిపారు.

ఇలా ఇప్ప‌టి వ‌రకు దేశంలో జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు ఎందుకు ఇలా చేశారంటే.. 2014, 2019 ఎన్నిక‌ల్లో మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పేర్కొన్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు అలా జ‌రిగింది లేదు.

పైగాదేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు ధ‌ర‌లకు చ‌ట్ట‌బ‌ద్ధత లేదు. రైతుల‌ను వ్య‌వ‌సాయ కూలీ లుగా మార్చే చ‌ట్టాలు తెస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో రైతులు ఆవేద‌న‌, ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేస్తున్నా రు. డిల్లీలో నెల‌లు, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు.

అయినా.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే ప‌నులు చేప‌ట్ట‌లేద‌న్న‌ది రైతు ల ఆవేద‌న‌. ముఖ్యంగా మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌న్న త‌మ డిమాండ్ ఇప్ప‌టికీ నెర‌వేర‌లేద ని వారు వాపోతున్నారు. ఈ క్ర‌మంలోనే మోడీకి దిమ్మ‌తిరిగిపోయేలా భారీ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. త‌మిళ‌నాడులో గత ఏడాది కాలంలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డిన రైతుల పుర్రెలు, ఎముక‌ల‌తో వారు ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

గ‌తంలో ఎప్పుడూ ఇలా.. పుర్రెలు, ఎముక‌ల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డంతో ఇది క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే దేశ‌వ్యాప్తంగా పాకిపోయింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ ఇప్పటి వరకూ చేయ‌లేద‌ని రైతులు ఆరోపించారు. అంతేకాదు.. మోడీపై పోటీ చేసి ఓడించేందుకు తాము సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు రైతు సంఘాల నాయ‌కులు కూడా ప్ర‌క‌టించారు. మొత్తానికి కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌,.. అటు ముస్లింలు, ఇటు రైతులు మోడీపై మండిప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.