Begin typing your search above and press return to search.

నా పేరు బన్నీ – నా డ్రింకు ఫ్రూటి

By:  Tupaki Desk   |   11 April 2018 10:51 AM GMT
నా పేరు బన్నీ – నా డ్రింకు ఫ్రూటి
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసడర్ గా కూడా కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. వేసవి తాపం తీర్చే మ్యాంగో డ్రింక్ ఫ్రూటికి మొట్టమొదటి సౌత్ ఇండియన్ మేల్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న బన్నీ ఈ రకంగా కూడా కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఒప్పందం జనవరిలోనే జరిగినప్పటికీ సీజన్ ఇప్పుడు మొదలైంది కాబట్టి ఫ్రూటి కూడా తన ప్రమోషన్ వేగాన్ని పెంచింది. అందులో భాగంగా వదిలిన యాడ్ ఫాన్స్ నే కాదు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటోంది.గలివర్ తరహాలో పెద్ద రూపంలో ఉండే అల్లు అర్జున్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చిన్న మినియేచర్స్ రూపంలో మర్రుగుజ్జులా ఉండే ఒక జంట బన్నీని పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా వెళ్లిపోతు ఉంటాడు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం ఉండదు. చివరికి పెద్ద మామిడి పండు తీసుకొచ్చి దాన్ని ఫ్రూటిగా మార్చి స్ట్రా పెట్టేసరికి అల్లు అర్జున్ ఈసారి వీళ్ళ వైపు చూస్తాడు. దాన్ని మనసారా తాగి ఆ జంటకు తన ఆటోగ్రాఫ్ ఉన్న ఫోటోను కానుకగా ఇస్తాడు. అన్నట్టు బన్నీకి ఒక డైలాగ్ కూడా ఉందండోయ్. అదేంటో తెలుసా. ఫ్రూటి తీస్కో జల్సా చేసుకో. నా పేరు సూర్య గెటప్ నే ఇందులో కంటిన్యూ చేసిన అల్లు అర్జున్ లుక్స్ ద్వారా సినిమాలో ఎలా ఉండబోతున్నాడో ఇందులో చూపించేసాడు. ఇదే యాడ్ హిందిలో బాలీవుడ్ హీరొయిన్ అలియా భట్ తో చేయించడం విశేషం. మే 4న విడుదల కాబోతున్న నా పేరు సూర్య కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. డిజే తర్వాత గ్యాప్ తీసుకుని వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి