Begin typing your search above and press return to search.

అనుష్క 14 ఏళ్ల క్రితం జ్ఞాపకాలు

By:  Tupaki Desk   |   13 March 2019 12:31 PM GMT
అనుష్క 14 ఏళ్ల క్రితం జ్ఞాపకాలు
X
టాలీవుడ్‌ లో దశాబ్ద కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌ గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. కొద్ది మందికి మాత్రమే దక్కిన ఆ గౌరవం అనుష్క కూడా పొందింది. అనుష్క గత సంవత్సర కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా ప్రేక్షకులు ఆమె సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. 'బాహుబలి' చిత్రంతో బాలీవుడ్‌ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న అనుష్క ప్రస్తుతం 'సైలెన్స్‌' అనే చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రంతో అనుష్క చిన్న గ్యాప్‌ తీసుకుని రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక అనుష్క సినీ ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఒక వీడియోను షేర్‌ చేసింది.

ఆ వీడియోలో అనుష్క మాట్లాడుతూ... సినిమాల్లోకి రావాలని నేనెప్పుడు అనుకోలేదు, సూపర్‌ సినిమా కోసం పూరి జగన్నాధ్‌ గారు హీరోయిన్‌ కోసం చూస్తుంటే మా ఇద్దరికి కామన్‌ గా తెలిసిన ఒక వ్యక్తి ఆయనకు నా గురించి చెప్పారు. అలా పూరి గారి నుండి కబురు వచ్చింది. అయిష్టంతోనే హైదరాబాద్‌ కు వచ్చా - కెమెరా ముందుకు వచ్చి అప్పుడే 14 ఏళ్లు అయ్యింది. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. పూరి జగన్నాధ్‌ గారు - నాగార్జున గారు నాకు ఈ జీవితాన్ని ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలంది.

'భాగమతి' చిత్రం తర్వాత అనుష్క గ్యాప్‌ తీసుకుంది. లావు తగ్గేందుకు అనుష్క గ్యాప్‌ తీసుకుందనే టాక్‌ వినిపిస్తుంది. ఈ గ్యాప్‌ లో కూడా అనుష్క భారీగా ఏమీ లావు తగ్గినట్లుగా అనిపించడం లేదు. అయినా కూడా అనుష్క నటించబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సైలెన్స్‌ చిత్రంతో పాటు అయ్యప్ప స్వామి నేపథ్యంలో సాగే ఒక చిత్రంలో కూడా అనుష్క నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. సౌత్‌ లోని అన్ని భాషల్లో కూడా ఆ సినిమాను తీయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన క్లారిటీ కూడా రానుంది.