Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అనుష్క.. అల్లాడిస్తోందిగా

By:  Tupaki Desk   |   11 Feb 2019 4:38 PM IST
ఫోటో స్టొరీ: అనుష్క.. అల్లాడిస్తోందిగా
X
గ్లామర్.. నటన రెండు కలిసి ఉండే హీరోయిన్లు టాలీవుడ్ లో అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన కాంబినేషనే అనుష్క. స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలతో నటించడమే కాదు లేడి ఓరియెంటెడ్ సినిమాలను ఒంటిచేత్తో నడిపించగలదు. కానీ ఈ అమ్మడు ఈ ముహూర్తాన 'సైజ్ జీరో' చేయడానికి ఓకే చెప్పిందో గానీ అనవసర బరువు అనుష్కను బేతాళుడు విక్రమార్కుడిని తగులుకున్నట్టు తగులుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వెయిట్ తగ్గని అనుష్క రీసెంట్ గా ఆస్ట్రియా దేశంలో న్యాచురల్ థెరపీ తీసుకుంటే తగ్గింది.

ఇప్పుడు మళ్ళీ నాజూగ్గా మారి మునుపటి 'మిర్చి' రోజులనాటి అనుష్కను తలపిస్తోంది. పైనున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో బీచ్ లో ఒక బండరాయి మీద కూర్చున్న అనుష్క ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చింది. వైట్ కలర్ డ్రెస్ లో.. డిఫరెంట్ హెయిర్ స్టైల్లో అనుష్కను చూస్తే ఎవరైనా ఫ్లాట్ కావాల్సిందే. ఈ ఫోటో అనుష్క అభిమానులకు ఫుల్ గా కిక్కిచ్చేదే.

'భాగమతి' సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతోంది. మెజారిటీ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో ఆర్. మాధవన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు కోన వెంకట్ నిర్మాత.