Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: టీనేజ్ జోకుల అల్లరి

By:  Tupaki Desk   |   24 Aug 2019 4:58 AM GMT
ట్రైలర్ టాక్: టీనేజ్ జోకుల అల్లరి
X
వచ్చే నెల 6న విడుదల కాబోతున్న హిందీ మూవీ చిచోరే మీద మెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే అంశాలు బాగానే ఉన్నాయి. మొదటిది సాహోతో తెలుగు డెబ్యూ చేస్తున్న శ్రద్ధా కపూర్ ఇందులో హీరోయిన్. రెండోది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టికి ఇది ఫస్ట్ బాలీవుడ్ మూవీ. ఈ రకంగా మనవాళ్ళు దీనికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

దీని తాలూకు కొత్త ట్రైలర్ ని విడుదల చేసింది టీమ్. ఫక్తు యూత్ మాస్ కాలేజీ జోకులతో నింపేసిన ఈ ట్రైలర్ లో పెద్ద పెద్ద కాలేజీల్లో యూనివర్సిటీలలో ర్యాగింగ్ మొదలుకుని వివిధ రకాల అనుభూతులు ఎలా ఉంటాయో సాంపుల్ రూపంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. చాలా చోట్ల మ్యూట్ ఉండాల్సిన రేంజ్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ఓ స్నేహితుల బ్యాచ్ చదువు పూర్తయ్యాక ఎవరి లైఫ్ లో వాళ్ళు సెటిలయ్యాక ఒకరికి పెద్ద కష్టం వచ్చినప్పుడు అందరూ ఒకేతాటి పైకి వచ్చి ఎలా తమ ఫ్రెండ్ షిప్ గొప్పదనాన్ని రుజువు చేసుకున్నారో చిచోరేలో చూపించబోతున్నారు.

దంగల్ ఫేమ్ నితేశ్ తివారి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుశాంత్ రాజ్ పుత్ మెయిన్ హీరో గా చేశాడు. కాకపోతే పాత్రలు అన్నింటికీ మంచి ప్రాధాన్యం ఇవ్వడంతో నవీన్ పోలిశెట్టికి సైతం ఇది మంచి బ్రేక్ గా నిలిచేలా కనిపిస్తోంది. యూత్ లేట్ ఏజ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కాలేజీ మెమొరీస్ ని కళ్ళకు కట్టేలా చూపించేందుకు వస్తున్న చిచోరే త్రీ ఇడియట్స్ రేంజ్ లో ఉండొచ్చనే ప్రీ టాక్ అయితే ముంబై మీడియాలో జోరుగా సాగుతోంది