Begin typing your search above and press return to search.

రీల్ హీరో కొడుకు రియ‌ల్ హీరో.. ఎలానంటే?

By:  Tupaki Desk   |   2 July 2019 5:40 AM GMT
రీల్ హీరో కొడుకు రియ‌ల్ హీరో.. ఎలానంటే?
X
పండిత పుత్ర.. సామెత‌ను చాలామంది విన్నోళ్లే. చాలా సంద‌ర్భాల్లో రాజ‌కీయ నాయ‌కులు.. సినీ తార‌లు.. సెల‌బ్రిటీలు.. ప్ర‌ముఖుల సంతానం.. త‌మ త‌ల్లిదండ్రుల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ వివాదాల్లో చిక్కుకుపోవ‌టం.. 'స‌న్' స్ట్రోక్ లాంటి షాకులిస్తుంటారు. అందుకు భిన్నంగా ఒక రీల్ హీరో కొడుకు రియ‌ల్ హీరోగా మారిన వైనాన్ని తాజాగా చోటు చేసుకుంది. ప్ర‌ముఖుల పిల్ల‌లు ఏదైనా రంగంలో రాణించి పేరు ప్ర‌ఖ్యాతులు సొంతం చేసుకోవ‌టం.. వార్త‌ల్లోకి ఎక్క‌టం లాంటివి చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి.

తాజాగా అలాంటి అరుదైన తీరును ప్ర‌ద‌ర్శించి అంద‌రి మ‌నసుల్ని గెలుచుకుంటున్నారు ప్ర‌ముఖ న‌టుడు మాధ‌వ‌న్ కుమారుడు వేదాంత్‌. తాజాగా జ‌రిగిన జాతీయ జూనియ‌ర్ స్విమ్మింగ్ పోటీలో అత‌గాడు నాలుగు ప‌త‌కాల‌తో మెరిసిపోయాడు. అత‌డు సాధించిన ప‌త‌కాల్లో మూడు బంగారు.. ఒక వెండి ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు.ఏడాది క్రితం అంత‌ర్జాతీయ స్థాయిలో జ‌రిగిన ఈత పోటీల్లో త‌న స‌త్తాను చాటి కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న వేదాంత్ తాజాగా నాలుగు విభాగాల్లో పాల్గొని నాలుగు ప‌త‌కాల్ని సాధించారు.

ప‌త‌కాల‌తోపాటు జాతీయ రికార్డును కూడా సాధించ‌టంపై మాధ‌వ‌న్ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో కొడుకు ప్ర‌తిభ‌పై సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. కొడుకు స‌మ‌ర్థ‌త వెలుగు చూసిన‌ప్పుడు ఏ తండ్రి మాత్రం మురిసిపోకుండా ఉంటారు చెప్పండి. ప్ర‌స్తుతం మాధ‌వ‌న్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాద‌నే చెప్పాలి.